Ayodhya Bell: అయోధ్య రాముడికి అరుదైన గంట.. మోగిస్తే ఓంకార శబ్ధం. వీడియో.

Ayodhya Bell: అయోధ్య రాముడికి అరుదైన గంట.. మోగిస్తే ఓంకార శబ్ధం. వీడియో.

Anil kumar poka

|

Updated on: Nov 29, 2023 | 6:02 PM

అయోధ్య రాముడి కోసం 2,500 కిలోల భారీ గంటను సిద్ధం చేసి విరాళంగా ఇచ్చేందుకు సిద్ధమైంది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం. ఇందుకోసం రూ. 25లక్షలు వెచ్చిస్తున్నట్లు ఇటావా జిల్లాకు చెందిన గంటలు తయారు చేసే మిత్తల్‌ కుటుంబం వెల్లడించారు. మోగించినపుడు ఓంకార శబ్దం రావడం దీని ప్రత్యేకత. ఈ గంటను జింక్‌, రాగి, సీసం, తగరం, నికెల్‌, వెండి, బంగారం వంటి 8 లోహాలతో తయారు చేశామని మిత్తల్ చెప్పారు.

అయోధ్య రాముడి కోసం 2,500 కిలోల భారీ గంటను సిద్ధం చేసి విరాళంగా ఇచ్చేందుకు సిద్ధమైంది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం. ఇందుకోసం రూ. 25లక్షలు వెచ్చిస్తున్నట్లు ఇటావా జిల్లాకు చెందిన గంటలు తయారు చేసే మిత్తల్‌ కుటుంబం వెల్లడించారు. మోగించినపుడు ఓంకార శబ్దం రావడం దీని ప్రత్యేకత. ఈ గంటను జింక్‌, రాగి, సీసం, తగరం, నికెల్‌, వెండి, బంగారం వంటి 8 లోహాలతో తయారు చేశామని మిత్తల్ చెప్పారు. దీని తయారీలో 250 మంది కార్మికులు పాల్గొన్నారని.. సుమారు మూడు నెలలు పట్టిందని తెలిపారు. అయోధ్య రామ మందిరానికి గంటను తయారు చేసి ఇవ్వాలనే ఆలోచన రాగానే అంగీకారం కోసం రామ మందిర నిర్మాణ ట్రస్ట్ ను సంప్రదించామనీ వారు తమ సమ్మతిని తెలియజేయడంతో గంట తయారీని ప్రారంభించినట్లు మిత్తల్ చెప్పారు. మొదట 1700 కిలోల బరువుతో గంట తయారీ పూర్తవుతుందనుకున్నామని, తరువాత 1900 కిలోలు తూగిందని తుది మెరుగులు దిద్దేసరికి గంట బరువు 2500 కిలోలకు చేరిందని అన్నారు. అయోధ్య రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన 2024 జనవరి 22న మధ్యాహ్నం 12.30 గంటలకు జరగనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడించింది. వేడుకకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఆలయంలో ఒకేసారి 75 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకునే వీలు కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.