Viral: భర్త చెవి కొరికేసిన భార్య.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.. వీడియో వైరల్.
ఈ మధ్యకాలంలో భార్య భర్తల మధ్య చిన్నచిన్న విషయాలకే మనస్పర్థలు వస్తున్నాయి. దాంతో కొట్టుకోవడం, లేదా చంపుకోవడం వంటివి చేస్తున్నారు. మొన్నటికి మొన్న పుట్టినరోజు వేడుకలకు తీసుకెళ్లలేదని భర్త ముక్కుపై తీవ్రంగా కొట్టింది ఓ మహిళ. ఆ ఘటనను ఇంకా మరువకముందే మరో మహిళ ఏకంగా భర్త చెవి కొరికేసింది. వేరు కాపురం పెట్టాలంటూ భర్తను వేధించింది. అందుకు అతను అంగీకరించక పోవడంతో ఏకంగా తన చెవినే కొరికేసింది.
ఈ మధ్యకాలంలో భార్య భర్తల మధ్య చిన్నచిన్న విషయాలకే మనస్పర్థలు వస్తున్నాయి. దాంతో కొట్టుకోవడం, లేదా చంపుకోవడం వంటివి చేస్తున్నారు. మొన్నటికి మొన్న పుట్టినరోజు వేడుకలకు తీసుకెళ్లలేదని భర్త ముక్కుపై తీవ్రంగా కొట్టింది ఓ మహిళ. ఆ ఘటనను ఇంకా మరువకముందే మరో మహిళ ఏకంగా భర్త చెవి కొరికేసింది. వేరు కాపురం పెట్టాలంటూ భర్తను వేధించింది. అందుకు అతను అంగీకరించక పోవడంతో ఏకంగా తన చెవినే కొరికేసింది. ఈ విషయాన్ని స్వయంగా బాధితుడే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిర్ఘాంతపోయారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. సుల్తాన్‌పూర్‌లో నివసించే ఓ జంట తరుచుగా గొడవలు పడేవారు. వేరు కాపురం పెట్టాలంటూ తరుచూ భార్య, భర్తతో గొడవకు దిగేది. ఈ క్రమంలో నవంబర్ 20వ తేది ఉదయం చెత్త పడేసేందుకు బయటికి వెళ్లిన భర్త.. భార్యతో ఇల్లంతా శుభ్రం చేయమని చెప్పి బయటికి వెళ్లాడు. అయితే, తిరిగి వచ్చేసరికి ఇళ్లు మునుపటిలానే ఉంది. దీంతో ఆ భర్త సదరు మహిళను ప్రశ్నించాడు. వెంటనే భార్య భర్తతో గొడవకు దిగింది. పనిలో పనలి తన గొడవ వెనుక అసలు విషయం బయట పెట్టింది. ఇంటిని అమ్మేసి వచ్చిన డబ్బుతో వేరు కాపుర పెడదామని చెప్పింది. ఇల్లు అమ్మేందుకు ఆ భర్త అంగీకరించకపోవటంతో సదరు మహిళ భర్తను ఇష్టమొచ్చినట్లుగా తిట్టడం ప్రారంభించింది. భార్య మాటలకు విసుగుచెందిన భర్త కోపంతో ఆమెను పక్కకు నెట్టేసి బయటకు వెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భార్య భర్తను వెనక్కి లాగి తన కుడిచెవి కొరికేసింది. ఇదంతా స్వయంగా బాధితుడే పోలీసులకు వివరించాడు. తన కుడిచెవి బాగా ఛిద్రమైపోయిందని, తన కుమారుడు తనను ఆస్పత్రికి తీసుకెళ్లాడని బాధితుడు ఫిర్యాదులో వెల్లడించాడు. కానీ అక్కడి డాక్టర్లు తనను మరో ఆస్పత్రిలో సర్జరీ చేయించుకోవాలని సూచించారని పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు అతని భార్యపై ఐపీసీ సెక్షన్ 324 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.