AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarkashi: కొనసాగుతున్న ఉత్తరకాశీ సొరంగంలో డ్రిల్లింగ్‌ పనులు.. వీడియో.

Uttarkashi: కొనసాగుతున్న ఉత్తరకాశీ సొరంగంలో డ్రిల్లింగ్‌ పనులు.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Nov 29, 2023 | 5:56 PM

ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీలో కూలిన సొరంగం కింద చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించే ప్రక్రియ ఇంకా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. వారు సురక్షితంగా బయటకు రావడానికి ఇంకా కొన్ని రోజులు, వారాలు కూడా పట్టే అవకాశం కనిపిస్తోంది. నవంబరు 12వ తేదీన ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటి నుంచి కార్మికులను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ సహాయక చర్యల్లో తరచూ ఆటంకాలు ఎదురవుతున్నాయి.

ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీలో కూలిన సొరంగం కింద చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించే ప్రక్రియ ఇంకా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. వారు సురక్షితంగా బయటకు రావడానికి ఇంకా కొన్ని రోజులు, వారాలు కూడా పట్టే అవకాశం కనిపిస్తోంది. నవంబరు 12వ తేదీన ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటి నుంచి కార్మికులను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ సహాయక చర్యల్లో తరచూ ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ అడ్డంకులను అధిగమిస్తూ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నారు. రెండు మూడు రోజులుగా శిథిలాల గుండా సమాంతరంగా చేసిన డ్రిల్లింగ్‌ పనులను ప్రస్తుతానికి పక్కనపెట్టేశారు. కొండ పై నుంచి నిట్టనిలువుగా 86 మీటర్ల డ్రిల్లింగ్‌ పనులను ఆదివారం మధ్యాహ్నం మొదలు పెట్టారు. భారీ బండలు లాంటివి అడ్డుపడకపోతే నవంబర్‌ 30వ తేదీకల్లా డ్రిల్లింగ్‌ పూర్తి అయ్యే అవకాశ ముందని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సభ్యుడు, మాజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ సయ్యద్‌ అతా హస్నాయిన్‌ వెల్లడించారు. 85 మీటర్ల వరకు డ్రిల్లింగ్‌ చేశాక సొరంగం పైకప్పుకు చేసిన కాంక్రీట్, ఉక్కు రాడ్ల నిర్మాణాన్ని ఛిద్రం చేసి మార్గం సుగమం చేయాల్సి ఉందదన్నారు. ఇప్పటి వరకూ ఆరు రకాల రెస్క్యూ ప్లాన్‌లను అమలుచేశామని, కానీ, మొదటిదే అన్నింటికన్నా సురక్షితంగా అనిపిస్తోందని, దాంతో సమాంతరంగా తవ్వే ప్లాన్‌ను మళ్లీ అమలుచేస్తామని చెప్పారు. డ్రిల్లింగ్‌ సమయంలో మెషిన్ల బ్లేడ్లను కాంక్రీట్‌ నిర్మాణ రాడ్‌లు ముక్కలు చేసేసాయని, అవి లోపలే ఉండిపోయాయని తెలిపారు. ప్లాస్మా, గ్యాస్‌ కట్టర్‌లతో ముక్కలను విడివిడిగా కట్‌చేసి బయటకు తీస్తున్నట్టు వెల్లడించారు. ముక్కలన్నీ తీసేశాక అదే మార్గంలో భారత సైన్యంలోని మద్రాస్‌ యూనిట్‌ ఇంజనీర్లు, ట్రెంచ్‌లెస్‌ ఇంజనీరింగ్‌ సంస్థల సంయుక్త బృందం మ్యాన్యువల్‌గా తవ్వడం మొదలుపెడుతుందని వివరించారు. మెషీన్‌ బ్లేడ్లు తొలగించాక మిగతా 15 మీటర్లను మ్యాన్యువల్‌గా తవ్వితే కార్మికులు చిక్కుకున్న చోటుకు చేరుకోవచ్చు అని ఆయన వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.