ట్రంప్ నాలుగు సార్లు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వని ప్రధాని మోదీ! కారణం ఏంటంటే..?
అమెరికా విధించిన 50 శాతం సుంకాల నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్ నుండి నాలుగు ఫోన్ కాల్స్‌ను తిరస్కరించారు. ట్రంప్ చర్యలపై మోదీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు కథనం పేర్కొంది. భారత రైతుల ప్రయోజనాలను కాపాడుకోవడంలో మోదీ రాజీ పడరని నివేదిక హైలైట్ చేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి నాలుగు కాల్స్‌ను స్వీకరించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరాకరించారని, సుంకాల వివాదం నేపథ్యంలో జర్మన్ వార్తాపత్రిక ఫ్రాంక్‌ఫర్టర్ అల్గెమైన్ జైటంగ్ ఈ విషయాన్ని నివేదించింది. సుంకాల విషయంలో ట్రంప్‌పై మోదీ కోపంగా ఉన్నట్లు కథనం వెల్లడించింది.
అధ్యక్షుడు ట్రంప్ భారతీయ వస్తువులపై సుంకాలను 50 శాతానికి రెట్టింపు చేసిన తర్వాత భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. బ్రెజిల్ తర్వాత భారత్‌పైనే అమెరికా ఎక్కువ సుంకాలు విధించింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసినందుకు భారత్‌పై 25 శాతం అదనపు సుంకం విధించింది అమెరికా. మొత్తం కలిసి భారతీయ వస్తువులపై 50 శాతం సుంకాలు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి.
అమెరికా ఒత్తిడిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రైతుల ప్రయోజనాల విషయంలో ఎప్పటికీ రాజీపడనని ప్రతిజ్ఞ చేశారు. సుంకాల కారణంగా ట్రంప్‌తో మాట్లాడటానికి ప్రధాని మోదీ ఇష్టపడకపోవడం అమెరికా అధ్యక్షుడి చర్యల వల్ల ప్రధాని ఎంతగా చిరాకు పడ్డారో చూపిస్తుందని కూడా FAZ నివేదించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




