India Covid-19: గుడ్ న్యూస్.. దేశంలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు.. పెరుగుతున్న రికవరీలు..

India Coronavirus cases: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో నిత్యం లక్షలాది మంది ఈ మహమ్మారి బారిన పడుతుండగా.. వేలాది మంది ప్రాణాలు

India Covid-19: గుడ్ న్యూస్.. దేశంలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు.. పెరుగుతున్న రికవరీలు..
India Corona Updates
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 05, 2021 | 10:21 AM

India Coronavirus cases: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో నిత్యం లక్షలాది మంది ఈ మహమ్మారి బారిన పడుతుండగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఉపశమనం కలిగించే విషయమేమిటంటే.. ప్రస్తుతం కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. మరణాలు పెరుగుతుండటం కొంచెం ఆందోళన కలిగిస్తోంది. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 1.20లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దాదాపు రెండు నెలల కనిష్టానికి కేసుల సంఖ్య చేరింది. నిన్న కొత్తగా 1,20,529 కేసులు నమోదు కాగా.. ఈ వైరస్ కారణంగా 3,380 మంది మరణించారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,86,94,879 కి పెరగగా.. మరణాల సంఖ్య 3,44,082 కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

నిన్న ఈ మహమ్మారి నుంచి 1,97,894 బాధితులు కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 2,67,95,549 కి పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15,55,248 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.19 శాతం ఉండగా.. యాక్టివ్ కేసుల రేటు 5.73శాతంగా ఉంది. రికవరీరేటు 93.08 శాతానికి పెరిగింది. శుక్రవారం 20,84,421 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. జూన్‌ 4న 36,50,050 మంది కరోనా టీకాలు తీసుకున్నారు. ఇప్పటివరకూ మొత్తంగా 22,78,60,317 డోసులను లబ్ధిదారులకు అందించారు.

Also Read:

Corbevax Vaccine: త్వరలోనే దేశంలో అతి తక్కువ ధరకే కొవిడ్ వ్యాక్సిన్.. పూర్తి వివరాలు

Twitter Ban: ఆ దేశంలో ట్విట్టర్‌‌ బ్యాన్… దేశాధ్యక్షుడి ట్వీట్‌ను డెలీట్ చేసిన రెండ్రోజుల్లోనే..

Indian Railways: రైళ్లలో విస్తృతంగా టికెట్ చెకింగ్ డ్రైవ్‌లు.. టికెట్ లేకుండా ప్రయాణికుల నుంచి రూ. 9.5 కోట్లు వసూలు