AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bird Flu Cases: వామ్మో.. పెంపుడు జంతువులకు కూడా బర్డ్‌ ఫ్లూ.. తస్మాత్‌ జాగ్రత్త!

Bird Flu Cases: బర్డ్ ఫ్లూ కేవలం కోళ్ల ఫామ్‌లకే పరిమితం అవుతుందని ఎంతోమంది అనుకుంటారు. నిజానికి కోళ్ళకే కాదు ఇంకా ఎన్నో జంతువులకు ఈ బర్డ్ ఫ్లూ వైరస్ సోకే అవకాశం ఉంది. దేశంలో వైరల్‌ భయం మరింత పెరుగుతోంది. కొత్త కొత్త వైరల్‌లు వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు..

Bird Flu Cases: వామ్మో.. పెంపుడు జంతువులకు కూడా బర్డ్‌ ఫ్లూ.. తస్మాత్‌ జాగ్రత్త!
Subhash Goud
|

Updated on: Feb 27, 2025 | 9:15 PM

Share

దేశంలో వైరల్‌ భయం మరింత పెరుగుతోంది. కొత్త కొత్త వైరల్‌లు వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు బర్డ్‌ ఫ్లూ వంటి వైరల్‌లు భయాందోళనకు గురిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో పెంపుడు జంతువులలో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వైరస్ (H5N1) అంటే బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. భారతదేశంలో ఇలాంటి కేసు ఇదే తొలిసారి. H5N1 ఇన్ఫ్లుఎంజా వైరస్ వల్ల కలిగే వ్యాధి. అందుకే ఇది ఎక్కువగా పక్షులు, జంతువులను ప్రభావితం చేస్తుంది. కానీ పిల్లులలో దాని ఉనికి మానవులకు కూడా వ్యాపించే ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

బర్డ్ ఫ్లూ కోడి లేదా పిల్లికి మాత్రమే కాకుండా మన ఇళ్లలో నివసించే అనేక ఇతర జంతువులకు కూడా వ్యాపిస్తుందని నిపుణులు అంటున్నారు. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

మానవులలో H5N1 బర్డ్ ఫ్లూ లక్షణాలు:

H5N1 బర్డ్ ఫ్లూ కళ్ళు, ముక్కు, నోటి ద్వారా వ్యాపిస్తుంది. దీని లక్షణాలలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం, దగ్గు, తీవ్రమైన న్యుమోనియా ఉండవచ్చు. ఇది కాకుండా తీవ్రమైన స్థితిలో సోకిన వ్యక్తికి మూర్ఛలు కూడా రావచ్చు. దీని వల్ల ప్రాణాపాయం కూడా సంభవించే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. H5N1 మానవులకు రోగనిరోధక శక్తి లేకపోవడంతో మరింత వ్యాపించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాధి సోకిన పిల్లులు అధిక జ్వరం, ఆకలి లేకపోవడం, నీరసంగా ఉంటుందట. వ్యాధి సోకిన తర్వాత ఒకటి నుండి మూడు రోజుల్లోపు ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయని చెబుతున్బారిన పడ్డాయి.

మనం ఇంట్లో చాలా పక్షులను పెంచుకుంటాము. అవి బర్డ్ ఫ్లూకి కారణమవుతాయి. వీటిలో కోళ్లు, బాతులు వంటి పక్షులు ఉన్నాయి. ఇంట్లో పెంచుకునే వాటిలో ఎక్కువగా కుక్కలు, పిల్లులు ఉంటాయి. అవి ఇతర పక్షులు, జంతువులతో కలిసితే వాటికి కూడా బర్డ్ ఫ్లూ రావచ్చు. పందులు సాధారణంగా ఇంటి బయట నివసిస్తాయి. కానీ వాటిని చాలా చోట్ల ఉంచుతారు. వాటికి బర్డ్ ఫ్లూ కూడా రావచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌