India Coronavirus: దేశంలో కరోనా అల్లకల్లోలం.. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు
India Covid-19 updates: భారతదేశంలో కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు, మరణాలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిత్యం
India Covid-19 updates: భారతదేశంలో కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు, మరణాలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిత్యం లక్షల్లో కోవిడ్-19 కేసులు నమోదవుతుండగా.. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే.. రోజురోజూకు వీటి సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతుండటం అంతటా భయం నెలకొంది. తాజాగా గత 24 గంటల్లో శనివారం దేశవ్యాప్తంగా 3,49,691 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 2,767 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,69,60,172 (1.69 కోట్లు) కు పెరగగా.. మరణాల సంఖ్య 1,92,311 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో కోవిడ్ ప్రారంభం నాటినుంచి.. అత్యధిక కోవిడ్ -19 కేసులు, మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. మూడు రోజుల నుంచి కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది.
ఇదిలాఉంటే.. నిన్న కరోనా నుంచి 2,17,113 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,40,85,110 కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 26,82,751 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 83.05 శాతం ఉండగా.. మరణాల రేటు 1.13 శాతం ఉంది. కాగా.. శనివారం దేశవ్యాప్తంగా 17,19,588 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి ఏప్రిల్ 24 వరకు మొత్తం 27,79,18,810 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది.
ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా.. 14,09,16,417 డోసులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
Also Read: