India Coronavirus: దేశంలో కరోనా అల్లకల్లోలం.. లక్ష మార్క్ దాటేసిన కొత్త కేసులు..
India Covid-19 Updates: జస్ట్ ఎనిమిదే ఎనిమిది రోజులు. ఏడు నెలల రికార్డును తుడిచి పెట్టేసింది. అవును, ఇండియాలో ఏడు నెలల తర్వాత డైలీ కరోనా కేసులు
India Covid-19 Updates: జస్ట్ ఎనిమిదే ఎనిమిది రోజులు. ఏడు నెలల రికార్డును తుడిచి పెట్టేసింది. అవును, ఇండియాలో ఏడు నెలల తర్వాత డైలీ కరోనా కేసులు మళ్లీ వన్ లాక్ మార్క్ దాటాయ్. అది కూడా జస్ట్ 8 డేస్‌లో. కేవలం ఎనిమిదే రోజుల్లోనే డైలీ కేసుల సంఖ్య పదివేల నుంచి లక్ష దాటాయి. గత 24 గంటల్లో లక్షా 17వేల కొత్త కేసులు రికార్డు అయ్యాయి. 200 డేస్ తర్వాత ఇదే హయ్యస్ట్ నెంబర్. గతేడాది జూన్ ఆరున ఫస్ట్ టైమ్ రోజువారీ కేసులు లక్ష మార్క్‌ను అందుకుంటే, మళ్లీ ఇప్పుడు కేసుల సంఖ్య లక్ష మార్క్ దాటింది.
కాగా.. గడిచిన 24 గంటల్లో (గురువారం) దేశవ్యాప్తంగా 1,17,100 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 302 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 3,71,363 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా నిన్న కరోనా నుంచి 30,836 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,43,71,845 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 4,83,178 మంది ప్రాణాలు కోల్పోయారు.
కాగా.. డైలీ పాజిటివిటి రేటు అమాంతం 7.74 శాతానికి పెరిగింది. కాగా.. ఇప్పటివరకు దేశంలో 149.66 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.
India reports 1,17,100 fresh COVID cases, 30,836 recoveries, and 302 deaths in the last 24 hours
Daily positivity rate: 7.74%
Active cases: 3,71,363 Total recoveries: 3,43,71,845 Death toll: 4,83,178
Total vaccination: 149.66 crore doses pic.twitter.com/5uqB5lmnMj
— ANI (@ANI) January 7, 2022
ఇదిలాఉంటే.. భారత్‌లో ఒమిక్రాన్ ఉధృతికి కూడా తెరపడడం లేదు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 3,007 కు చేరింది. 27 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. ఇప్పటివరకు ఈ వేరియంట్ నుంచి 1999 మంది కోలుకున్నట్లు కేంద్రం తెలిపింది.
COVID19 | A total of 3,007 #Omicron cases were reported in 27 States/UTs of India so far. The number of persons recovered is 1,199: Union Health Ministry pic.twitter.com/RVmygx7wX1
— ANI (@ANI) January 7, 2022
Also Read: