Omicron: దేశంలో భారీగా విస్తరిస్తున్న ఒమిక్రాన్.. 3 వేలు దాటిన కేసుల సంఖ్య

Omicron cases in India: దేశంలో కరోనా కేసులతోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. కరోనాతోపాటు ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో

Omicron: దేశంలో భారీగా విస్తరిస్తున్న ఒమిక్రాన్.. 3 వేలు దాటిన కేసుల సంఖ్య
Omicron
Follow us

|

Updated on: Jan 07, 2022 | 11:23 AM

Omicron cases in India: దేశంలో కరోనా కేసులతోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. కరోనాతోపాటు ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,007 కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను శుక్రవారం ఉదయం విడుదల చేసింది. కాగా.. ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో.. అత్యధికంగా మహారాష్ట్రలో 876 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఢిల్లీలో 465, కర్ణాటకలో 333, రాజస్థాన్‌లో 291, కేరళలో 284, గుజరాత్‌లో 204, తమిళనాడులో 121 కేసులు, హర్యానాలో 114, తెలంగాణలో 107, ఒడిశాలో 60, ఉత్తరప్రదేశ్‌లో 31, ఆంధ్రప్రదేశ్‌లో 28, పశ్చిమ బెంగాల్‌లో 27 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

కాగా.. ఇప్పటివరకు ఒమిక్రాన్ బారి నుంచి 1,199 మంది కోలుకున్నట్లు తెలిపింది. అయితే.. రానున్న కాలంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచిస్తోంది.

ఇదిలాఉంటే.. దేశంలో రోజువారి కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. జూన్ తర్వాత కరోనా కేసుల సంఖ్య లక్ష మార్క్ దాటింది. కాగా.. గడిచిన 24 గంటల్లో (గురువారం) దేశవ్యాప్తంగా 1,17,100 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 302 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 3,71,363 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా నిన్న కరోనా నుంచి 30,836 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,43,71,845 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 4,83,178 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read:

India Coronavirus: దేశంలో కరోనా అల్లకల్లోలం.. లక్ష మార్క్ దాటేసిన కొత్త కేసులు..

Encounter: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు