Encounter: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం..

Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజగా శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు,

Encounter: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం..
Encounter
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 07, 2022 | 9:30 AM

Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజగా శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. బుడ్గాం పరిధిలోని జోల్వా క్రాల్పోరా ఛదూరా ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. వారినుంచి 3 ఏకే 47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో గురువారం రాత్రినుంచి స్థానిక పోలీసులు, బలగాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని.. ఈ ప్రాంతంలో ఇంకా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్కౌంటర్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా.. గత రెండు వారాల నుంచి జమ్మూ కాశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఎన్‌కౌంటర్లల్లో దాదాపు 8 మంది ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

Also Read:

House Collapsed: తీవ్ర విషాదం.. గాఢనిద్రలో ఉండగా కుప్పకూలిన భవనం.. ఇద్దరు మృతి

Kerala High Court: చెప్పేందుకు చాలా ధైర్యం కావాలి.. లైంగిక వేధింపులపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..