House Collapsed: తీవ్ర విషాదం.. గాఢనిద్రలో ఉండగా కుప్పకూలిన భవనం.. ఇద్దరు మృతి

House Collapsed in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని బేగంపూర్ ప్రాంతంలో తెల్లవారుజామున ఓ ఇల్లు

House Collapsed: తీవ్ర విషాదం.. గాఢనిద్రలో ఉండగా కుప్పకూలిన భవనం.. ఇద్దరు మృతి
House Collapsed
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 07, 2022 | 8:57 AM

House Collapsed in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని బేగంపూర్ ప్రాంతంలో తెల్లవారుజామున ఓ ఇల్లు కూలిపోవడంతో.. ఆ ఇంట్లోని ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరొకరిని సురక్షితంగా రక్షించారు. గాయపడిన వారిని అంబేద్కర్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన తెల్లవారుజామున 4:15 గంటలకు జరిగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భవనం శిథిలావస్థకు చేరడంతోనే కూలిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ మేరకు పోలీసులు, అధికారులు స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Andhra Pradesh: విజయనగరంలో మిస్టరీగా మారిన కానిస్టేబుల్ మిస్సింగ్.. అసలేం జరిగిందంటూ..

Kerala High Court: చెప్పేందుకు చాలా ధైర్యం కావాలి.. లైంగిక వేధింపులపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..