U.S. Covid-19 Updates: అమెరికాలో కరోనా వణుకు.. ఒక్కరోజే 7 లక్షలకు పైగా కొత్త కేసులు

కోవిడ్ వైరస్ ధాటికి అమెరికా వణికిపోతోంది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ అమెరికన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొద్ది రోజులుగా అక్కడ రోజువారీ కేసులు సంఖ్య రికార్డు స్థాయిలో..

U.S. Covid-19 Updates: అమెరికాలో కరోనా వణుకు.. ఒక్కరోజే 7 లక్షలకు పైగా కొత్త కేసులు
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 07, 2022 | 9:52 AM

కోవిడ్ వైరస్ ధాటికి అమెరికా వణికిపోతోంది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ అమెరికన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొద్ది రోజులుగా అక్కడ రోజువారీ కేసులు సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గత సోమవారం నుంచి మొదలు నేటి వరకు లక్షల్లో కేసులు రికార్డ్ అవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే అక్కడ 7.63 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదైనట్లు అమెరికా ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

నూతన సంవత్సర వేడుకల ప్రభావం అగ్రరాజ్యంపై తీవ్రంగా పడింది. దీంతో రోజు రోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గతంలో కంటే మూడు రెట్లు పెరిగాయి. జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో 763,878 కొత్త కేసులు నమోదయ్యాయి. కేవలం ఒక్క రోజులోనే 1,797 కోవిడ్‌కు బలయ్యారు. ఇక వైరస్​ బారినపడి ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది.

ప్రస్తుతం ఆసుపత్రుల్లో 126,166 మందికి పైగా చికిత్స పొందుతున్నారు.  ఒకవైపు కరోనా..మరోవైపు ఒమిక్రాన్ విజృంభణతో 12 నుంచి 15 ఏళ్ల వయసు వారితో పాటు బూస్టర్​ డోస్​ అందించేందుకు ఫైజర్​ టీకాకు అనుమతులిచ్చింది

ఇవి కూడా చదవండి: Dharmavaram Politics: హాట్‌ హాట్‌గా అనంతపురం రాజకీయాలు.. ధర్మవరంపై కన్నేసిన ఆ ముగ్గురు..

గుడ్‌న్యూస్.. QR కోడ్‌ని స్కాన్ చేసి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు తెలుసా.. పూర్తి వివరాలు ఇవే..