INDIA MPs Manipur Visit: పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.. అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించాలి: ఇండియా కూటమి
INDIA MPs Manipur Visit: మణిపూర్‌లో హింస దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే, మణిపూర్ పరిస్థితులు ఊహించినదానికంటే చాలా దారుణంగా ఉన్నాయని రాష్ట్రంలో పర్యటించిన ‘ఇండియా’ ఎంపీల బృందం ఆవేదన వ్యక్తం చేసింది. మణిపూర్‌లో 21 మంది విపక్ష ఎంపీలు రెండు రోజుల పాటు పర్యటించారు.

INDIA MPs Manipur Visit: మణిపూర్‌లో హింస దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే, మణిపూర్ పరిస్థితులు ఊహించినదానికంటే చాలా దారుణంగా ఉన్నాయని రాష్ట్రంలో పర్యటించిన ‘ఇండియా’ ఎంపీల బృందం ఆవేదన వ్యక్తం చేసింది. మణిపూర్‌లో 21 మంది విపక్ష ఎంపీలు రెండు రోజుల పాటు పర్యటించారు. ఇవాళ గవర్నర్ అనసూయతో ఎంపీల బృందం భేటీ అయ్యింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడానికి చర్చలు తీసుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. గత 89 రోజులుగా మణిపూర్‌లో హింస చెలరేగుతోందని , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల బాగోగులను పట్టించుకోవడం లేదని విపక్ష నేతలు విమర్శించారు. ఇంఫాల్, చుర్‌చందాపూర్ , మొయిరంగ్ రిలీఫ్ క్యాంప్‌ల్లో ఉన్న బాధితులను ఎంపీలు పరామర్శించారు. శిబిరాల్లో ఉన్న వారికి కనీస సౌకర్యాలు లేవంటూ విమర్శలు గుప్పించారు. శిబిరాలను పెంచాలని ప్రభుత్వానికి సూచించారు. ఒక్కో హాల్ లో 500 మంది ఉన్నారని.. కనీసం ఒక్క బాత్ రూమ్ కూడా లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగానే ఉందని విపక్ష నేతలు తెలిపారు.
మణిపూర్‌లో తాము చూసిన ప్రజల కష్టాలను పార్లమెంట్‌లో వివరిస్తామన్నారు లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్‌రంజన్ చౌదరి. అవిశ్వాస తీర్మానంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చను ప్రారంభించాలని కోరారు. తమ అభిప్రాయాలతో గవర్నర్ కూడా ఏకీభవించారని అధిర్ రంజన్ వివరించారు. మణిపూర్ పరిస్థితికి పరిష్కారం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని గవర్నర్ విజ్ఞప్తి చేశామని.. అవకాశం దొరికిన వెంటనే పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. ప్రజలు లేవనెత్తిన సమస్యలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లోపాలను ప్రశ్నిస్తామన్నారు. ఆలస్యం చేయకుండా తమ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించాలని, మణిపూర్ సమస్యపై చర్చ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అధిర్ రంజన్ సూచించారు. పరిస్థితి మరింత దిగజారుతోందని.. ఇది జాతీయ భద్రతా సమస్యలను పెంచుతోందని స్పందించాలని కోరారు.




#WATCH | After meeting Manipur Governor Anusuiya Uikey, I.N.D.I.A. alliance delegation addresses the media.
Congress MP Adhir Ranjan Chowdhury says, “…Governor has suggested that everyone should work together to find out a solution to the Manipur situation. As soon as we get… pic.twitter.com/9fqpItv9SL
— ANI (@ANI) July 30, 2023
మే 4వ తేదీన అల్లరిమూకలు నగ్నంగా ఊరేగించిన ఇద్దరు మహిళలను కూడా ఎంపీల బృందం పరామర్శించింది. తన భర్త , కుమారుడి మృతదేహాలను చూపించాలని బాధిత మహిళ ఎంపీలకు విజ్ఞప్తి చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..