AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NITI Aayog Meeting: కేంద్ర బడ్జెట్‌పై ఇండియా కూటమి సీఎంల కన్నెర్ర.. రేవంత్ రెడ్డి, స్టాలిన్ బాటలోనే మమతా బెనర్జీ..

కేంద్ర బడ్జెట్‌పై కన్నెర్ర చేస్తున్న ఇండియా కూటమి ముఖ్యమంత్రులు... నీతి ఆయోగ్‌ మీటింగ్‌ని బాయ్‌కాట్‌ చేయడమే కాదు, అదే రోజు పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునివ్వడం హాట్‌టాపిక్‌గా మారింది.

NITI Aayog Meeting: కేంద్ర బడ్జెట్‌పై ఇండియా కూటమి సీఎంల కన్నెర్ర.. రేవంత్ రెడ్డి, స్టాలిన్ బాటలోనే మమతా బెనర్జీ..
India Bloc CMs
Shaik Madar Saheb
|

Updated on: Jul 25, 2024 | 9:37 PM

Share

కేంద్ర ప్రభుత్వం పద్దతేం బాలేదు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే నిధులు కేటాయించారు. వారికి మద్దతిచ్చిన ప్రభుత్వాలపైనే వరాలు కురిపించారంటూ… కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కన్నెర్ర చేస్తున్నారు ఇండియా కూటమి ముఖ్యమంత్రులు. మిగతా రాష్ట్రాలు దేశంలో లేవా..? వాటి అభివృద్ధికి పాటు పాడాల్సిన బాధ్యత కేంద్రంపై లేదా..? అంటూ ఇండియా కూటమి సీఎంలు ఈనెల 27న జరగబోయే నీతి ఆయోగ్‌ మీటింగ్‌ను బహిష్కరిస్తున్నాయి. బడ్జెట్‌లో మాకేం ఇచ్చారు…? మేం ఎందుకు రావాలంటూ… నీతి ఆయోగ్‌ మీటింగ్‌ని పలు రాష్ట్రాల సీఎంల బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు తమిళనాడు సీఎం స్టాలిన్.. నీటి ఆయోగ్‌ మీటింగ్‌ రోజే కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. స్టాలిన్‌ లాగే పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎంలు సైతం నిరసనలకు పిలుపునిచ్చే అవకాశం కనిపిస్తోంది.

నీతి ఆయోగ్‌ మీటింగ్‌ను బాయ్‌కాట్‌ చేస్తున్న ముఖ్యమంత్రుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. లేటెస్ట్‌గా పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నీతి ఆయోగ్‌ మీటింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర బడ్జెట్‌కు నిరసనగానే మీటింగ్‌కు వెళ్లొద్దని నిర్ణయించుకున్నట్లు మమతా బెనర్జీ వెల్లడించారు.

ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్‌, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు, కేరళ సీఎం పినరయి విజయన్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్.. నీతి ఆయోగ్‌ మీటింగ్‌కు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తమపై కక్ష కట్టిన కేంద్రం తీరును ఎండగడతామంటూ నిప్పులు చెరుగుతున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను సవరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను పట్టించుకోకపోవడం దారుణంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో నీతి ఆయోగ్ మీటింగ్ ను బహిష్కరించడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..