AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP Vs Varun Gandhi: బీజేపీ-వరుణ్ గాంధీ మధ్య పెరుగుతున్న గ్యాప్.. 4 డిమాండ్లతో ప్రధాని మోడీకి లేఖాస్త్రం

BJP Vs Varun Gandhi: బీజేపీ, ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ మధ్య గ్యాప్ మరింత పెరుగుతోంది. గత కొన్ని మాసాలుగానే పలు కీలక అంశాలపై సొంత పార్టీ(బీజేపీ)ని ఇబ్బందిపెడుతూ వరుణ్ గాంధీ బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు.

BJP Vs Varun Gandhi: బీజేపీ-వరుణ్ గాంధీ మధ్య పెరుగుతున్న గ్యాప్.. 4 డిమాండ్లతో ప్రధాని మోడీకి లేఖాస్త్రం
Varun Gandhi
Janardhan Veluru
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 23, 2021 | 6:23 PM

Share

BJP Vs Varun Gandhi: బీజేపీ, ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ మధ్య గ్యాప్ మరింత పెరుగుతోంది. యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ..  గత కొన్ని మాసాలుగానే పలు కీలక అంశాలపై సొంత పార్టీ(బీజేపీ)ని ఇబ్బందిపెడుతూ వరుణ్ గాంధీ బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వరుణ్ గాంధీ.. బీజేపీని మరింత ఇబ్బందిపెడుతూ.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలో వరుణ్ గాంధీ నాలుగు కీలక డిమాండ్లు చేశారు. సాగు చట్టాలను ప్రధాని మోడీ ముందుగానే ఉపసంహరించుకుని ఉంటే 700 మంది రైతులు ఇప్పుడు ప్రాణాలతో ఉండేవారని వరుణ్ గాంధీ పేర్కొన్నారు. ఏడాదిపాటు సాగిన రైతుల ఆందోళనలో ప్రాణాలు విడిచిన అన్నదాతల కుటుంబీలకు తలా రూ.1 కోటి పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు.

ఆందోళన చేస్తున్న రైతులపై రాజకీయ ప్రేరేపిత ఫేక్ కేసులు నమోదు చేశారని వరుణ్ గాంధీ ఆరోపించారు. ఈ కేసులన్నిటినీ తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రైతుల పంటలకు కన్నీస మద్ధతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అలాగే లఖింపూర్ ఖేరి ఘటనను కూడా వరుణ్ గాంధీ తన లేఖలో మరోసారి లేవనెత్తారు. అక్టోబర్ 3న జరిగిన ఈ ఘటనలో ఐదుగురు రైతులను కార్లు ఎక్కించి హతమార్చారని.. మన ప్రజాస్వామ్యంలో ఇదే హృదయవిదారక ఘటనగా పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రిపై చర్యలు తీసుకుని, ఈ కేసు దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరిగేలా చూడాలని వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు.

బీజేపీకి దూరమవుతున్న వరుణ్ గాంధీ.. క్రమంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోవచ్చని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Also Read..

కోలకళ్లతో .. చిరుమందహాసంతో.. కట్టిపడేస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు హాట్ యాంకర్.. గుర్తుపట్టారా..?

Nandamuri Ramakrishna: కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబులకు నందమూరి రామకృష్ణ స్ట్రయిట్ వార్నింగ్..

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..