Nandamuri Ramakrishna: కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబులకు నందమూరి రామకృష్ణ స్ట్రయిట్ వార్నింగ్..

తన భార్యపై, కుటుంబంపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాాబు కన్నీటి పర్యంతం అయిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై నందమూరి కుటుంబ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టారు.

Nandamuri Ramakrishna: కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబులకు నందమూరి రామకృష్ణ స్ట్రయిట్ వార్నింగ్..
Nandamuri Ramakrishna
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 20, 2021 | 1:10 PM

తన భార్యపై, కుటుంబంపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు కన్నీటి పర్యంతం అయిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై నందమూరి కుటుంబ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టారు. రాజకీయాలతో సంబంధం లేని మహిళపై.. ఈ రకమైక కామెంట్స్ హేయమన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నందమూరి రామకృష్ణ ఎమోషనల్ అయ్యారు. రెండు, మూడేళ్ల నుంచి చూస్తున్న ఘటనలు చూస్తుంటే… చాలా బాధగా ఉందన్నారు. తమ కుటుంబం జోలికి ఎవరొచ్చినా వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి పరిణామం ఏ కుటుంబానికి జరగకూడదన్నారు. ద్వారంపూడి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు హద్దులు మీరారని.. వారు భవిష్యత్ గురించి ఆలోచించుకోని మాట్లాడాలన్నారు. మీ ఇళ్లలో ఆడవాళ్లు ఏమనుకుంటున్నారో చూసుకోండి అంటూ ఫైరయ్యారు నందమూరి రామకృష్ణ. రాజకీయంగా ఉంటే… రాజకీయంగానే చూసుకోవాలని.. వ్యక్తిగతంగా విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. తామేం గాజులు తొడుక్కుని కూర్చోలేదని..  ఎన్టీఆర్, టీడీపీ క్రమశిక్షణ మాత్రమే నేర్పిందని పేర్కొన్నారు. తమ సహనాన్ని పరీక్షించొద్దని నందమూరి రామకృష్ణ వార్నింగ్ ఇచ్చారు.  ఇకపై వైసీపీ హద్దు మీరితే… తామూ హద్దు మీరుతామని స్పష్టం చేశారు.

Also Read: నటి ఛౌరాసియాపై దాడి కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుడి సీసీ విజువల్స్ విడుదల