Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: ఇంట్లో నుంచి ఒకటే దుర్వాసన.. ఏంటని చూసిన స్థానికుల గుండె గుభేల్.. చివరకు పోలీసుల ఎంట్రీతో..

మనిషి జీవితంలో చావు తప్పదు. ఎప్పటికైనా అది రావాల్సిందే. అది వచ్చిన రోజు అన్ని బంధాలను పుటుక్కుమని తెంపేసి నిర్దాక్షిణ్యంగా తనతో పాటు తీసుకెళ్లిపోతుంది. వారిని నమ్ముకున్న వారిని ఒంటరి వాళ్లను చేసి..

Tamil Nadu: ఇంట్లో నుంచి ఒకటే దుర్వాసన.. ఏంటని చూసిన స్థానికుల గుండె గుభేల్.. చివరకు పోలీసుల ఎంట్రీతో..
House
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 12, 2022 | 9:12 AM

మనిషి జీవితంలో చావు తప్పదు. ఎప్పటికైనా అది రావాల్సిందే. అది వచ్చిన రోజు అన్ని బంధాలను పుటుక్కుమని తెంపేసి నిర్దాక్షిణ్యంగా తనతో పాటు తీసుకెళ్లిపోతుంది. వారిని నమ్ముకున్న వారిని ఒంటరి వాళ్లను చేసి వెళ్లిపోతుంది. కానీ ఆప్తులపై ఏర్పడిన ప్రేమ ఊరుకుంటుందా. ఇష్టమైన వారు దూరమయ్యారనే బాధ ఎంతటి పని చేసేందుకైనా వెనకాడదు అనే దానికి ఉదాహరణే ఈ ఇన్సిడెంట్. కుటుంబ పెద్దగా, తల్లిగా, భార్యగా ప్రేమానురాగాలు కురిపించిన వ్యక్తి.. ఇక లేరనే చేదు నిజాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. ఆమెను ఎలాగైనా తిరిగి బతికించుకోవాలని ఆశపడ్డారు. కానీ వారి ఆశలు నెరవేరవని తెలుసుకోలేకపోయారు. ఒక సారి చనిపోయిన వారు తిరిగి రారనే వాస్తవాన్ని గ్రహించలేకపోయారు. ఆమె తిరిగి రావాలంటూ మృతదేహం వద్ద ప్రార్థనలు చేశారు. రోజులు గడుస్తున్నా ఆమె తిరిగి రాలేదు కానీ.. వారి ఇంటి ముందు జనాలు గుమిగూడారు. దుర్వాసన వస్తోందని పోలీసులకు కంప్లైంట్ చేశారు. వారు వచ్చి మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. తమిళనాడు లోని మదురైలో ఈ ఘటన జరిగింది.

తమిళనాడు లోని మదురై ఎస్‌ఎస్‌ కాలనీ లో బాలకృష్ణన్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. అతనికి భార్య మాలతి, ఇద్దరు కుమారులు సంతానం. బాలకృష్ణన్‌ ఓ ప్రైవేట్‌ హోటల్‌లో మేనేజర్‌ గా పని చేస్తుండగా.. కుమారులిద్దరూ వైద్య విద్య చదువుతున్నారు. ఈ క్రమంలో మాలతి ఈ నెల 8 న అనారోగ్యంతో మృతి చెందారు. పుట్టెడు దుఖంలో ఉన్న ఆ కుటుంబీకులు మాలతి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఆమె డెడ్ బాడీని ఫ్రీజర్ బాక్స్ లో ఉంచారు. మాలతి చనిపోయిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. మూడు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో స్థానికులు కంగారు పడ్డారు. బాలకృష్ణన్ ఇంటికి బయల్దేరారు. అక్కడ జరుగుతున్న సీన్ ను చూసి భయంతో వణికిపోయారు. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా ప్రార్థనలు చేస్తుండటం వారిని విస్తుగొలిపింది. ఇలా ప్రార్థనలు చేస్తే మాలతి తిరిగి ప్రాణాలతో వస్తుందని వారు స్థానికులకు చెప్పడం గమనార్హం.

ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని తీసుకెళ్తుండగా బాలకృష్ణన్ కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. మాలతి డెడ్ బాడీని తీసుకెళ్తే సూసైడ్ చేసుకుంటామని బెదిరించారు. దీంతో అవాక్కైన పోలీసులు గందరగోళ పరిస్థితులు సృష్టిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించడంతో మృతదేహాన్ని తిరునెల్వేలి జిల్లా కళకాట్టికి తీసుకెళ్లారు. హిందువులైన బాలకృష్ణన్‌ కుటుంబం కొన్నేళ్ల క్రితం క్రైస్తవ మతం స్వీకరించడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..