Money Bag: రోడ్డు పక్కన చెట్ల పొదల్లో భారీ బ్యాగ్.. ఓపెన్ చేయగా నిండా డబ్బే.. అంతలోనే ఊహకందని ట్విస్ట్..

Bengaluru News: కర్నాటక రాజధాని బెంగళూరులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన భారీ బ్యాగ్ నిండా డబ్బులు కనిపించడంతో జనాలు ఎగబడ్డారు. ఆ డబ్బును తీసుకునేందుకు పోటీ పడ్డారు. అయితే, పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్ అయ్యింది. అప్పటి వరకు ఏ నోట్ల కోసం ఎగబడ్డారో..

Money Bag: రోడ్డు పక్కన చెట్ల పొదల్లో భారీ బ్యాగ్.. ఓపెన్ చేయగా నిండా డబ్బే.. అంతలోనే ఊహకందని ట్విస్ట్..
Money
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 26, 2023 | 3:25 PM

Bengaluru, July 26: కర్నాటక రాజధాని బెంగళూరులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన భారీ బ్యాగ్ నిండా డబ్బులు కనిపించడంతో జనాలు ఎగబడ్డారు. ఆ డబ్బును తీసుకునేందుకు పోటీ పడ్డారు. అయితే, పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్ అయ్యింది. అప్పటి వరకు ఏ నోట్ల కోసం ఎగబడ్డారో.. పోలీసుల ఎంట్రీ తరువాత ఆ నోట్లనే దీనంగా చూస్తూ వదిలేశారు. ఇందుకు కారణం ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బెంగళూరులోని కనకపుర రోడ్డులో ఓ నిర్మానుష్య ప్రాంతలోని చెట్ల పొదల్లో భారీ సైజు లగేజీ స్థానికుల కంట పడింది. అదికాస్త అనుమానాస్పదంగా కనిపించడంతో.. ఓపెన్ చేసి చూశారు. ఇంకేముంది.. బ్యాగ్ నిండా జిగేల్‌మంటూ గులాబీ రంగులో ఉన్న పెద్ద నోట్లు.. అదేనండీ రూ. 2000 నోట్లు దర్శనమిచ్చాయి. ఇంకేముంది.. అది చూసి లైఫ్ సెట్‌ రా అనుకున్నారు. కానీ, అంతలోనే మిగతా స్థానికులు కూడా ఆ డబ్బును చూశారు. ఇలా డబ్బు కోసం ఎగబడ్డారు. ఇంతలో కొందరు వ్యక్తులు విషయాన్ని తలఘట్టాపూర్ పోలీస్ స్టేషన్‌ చేరవేశారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ఆ నోట్లను పరిశీలించారు. అవన్నీ జీరాక్స్ తీసిన నకిలీ నోట్లు మాత్రమేనని గుర్తించారు.

ఇక అప్పటి వరకు నోట్ల కోసం ఎగబడిన జనాలు.. చివరకు అవి నకిలీ నోట్లు అని తెలియడంతో ఉసూరుమన్నారు. తీసుకున్న నోట్లన్నీ అక్కడే పడేశారు. కాగా, ఈ నకిలీ నోట్లు రూ. 10 కోట్లు ఉంటాయని వెల్లడించారు పోలీసులు. ౠ నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. ఈ నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు ఇక్కడ పడేశారు? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..