Flash Floods Video: హిండన్ నది ఒడ్డున కార్ల బతుకమ్మలు.. షాకింగ్ వీడియో మీ కోసం..

హిండన్ నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. నీటి మట్టం తగ్గడం లేదు. నిత్యం ఇళ్లలోకి నీరు చేరుతోంది. ఇప్పటి వరకు 10 వేలకు పైగా ఇళ్లను ఖాళీ చేయించారు. పార్కింగ్ స్థలంలో పార్క్ చేసిన వాహనాలు కూడా నీటిలో మునిగిపోయాయి.

Flash Floods Video: హిండన్ నది ఒడ్డున కార్ల బతుకమ్మలు.. షాకింగ్ వీడియో మీ కోసం..
Hindon Flood
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 26, 2023 | 5:15 PM

ఉత్తరభారతంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో వరదలు వణికిస్తున్నాయి. ఢిల్లీ శివార్లలో యమునా నది ప్రవాహం ఉధృతమవుతోంది. భారీ వర్షాల కారణంగా నోయిడాలోని హిండన్ నది నీటి మట్టం అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలో సమీపంలోని ప్రాంతాలన్నీ ముంపు బారిన పడ్డాయి. నది నీటిమట్టం పెరుగుదలతో ఎకోటెక్ 3 సమీపం ప్రాంతాలన్నీ ఇంకా వరదలో చిక్కుకుపోయాయి. రెండు రోజులుగా వరద గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తున్నారు స్థానికులు.

ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వాననీరు నిలిచిపోయి రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరోవైపు నోయిడాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఢిల్లీ – మెహ్రౌలీ హైవేపై వరదనీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. నోయిడాలో హిండన్‌ నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది.

ఇక రెండు రోజుల నుంచి ముంపు ప్రాంతాలు నీటిలోనే తేలియాడుతున్నాయి. వరద నీరు పోయేందుకు దారి లేక వందలాది ఇళ్ళు, వాహనాలు నీట మునిగాయి. ఇక మంగళవారం నుంచి గ్రేటర్ నోయిడాలోని ఓలా పార్కింగ్‌ స్లాట్‌లో మునిగి కార్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది.

వరద నీటిలో దాదాపు 400 వాహనాలు..

కరోనా కాలం నాటి నుంచి పాత, రికవరీ చేసిన కార్లను నోయిడాలోని సుతియానా గ్రామ సమీపంలోని డంపింగ్ యార్డ్‌లో పార్క్ చేస్తోంది ఓలా. ఇలా 400 కార్ల వరకు ఇక్కడికి తరలించారు. రెండు రోజులుగా నీటిలో బతుకమ్మల్లా కార్లు తేలియాడుతూనే ఉన్నాయి. ఇక హిండన్ నది నీటిమట్టం అంతకంతకు పెరుగుతున్న దృష్ట్యా యార్డును ఖాళీ చేయాలని ఓలా కంపెనీ నిర్వాహకులకు నోటీసులిచ్చారు అధికారులు. మరోవైపు ఓలా డంప్‌యార్డు ఆపరేటర్‌పైనా, కంపెనీపైనా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది నోయిడా అథారిటీ.

మరిన్ని జాతీయ వార్తల కోసం