Modi Government: దసరా పండుగ వేళ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం…

కేంద్రం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.  రబీ సాగు సీజన్‌లో రైతులకు పోషకాలతో కూడిన ఎరువులు తక్కువ ధరకు అందించే దిశగాకీలక నిర్ణయం తీసుకుంది.

Modi Government: దసరా పండుగ వేళ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం...
Modi Farmers
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 14, 2021 | 5:15 PM

దసరా పండుగ వేళ.. కేంద్రం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.  రబీ సాగు సీజన్‌లో రైతులకు పోషకాలతో కూడిన ఎరువులు తక్కువ ధరకు అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-మార్చి కాలంలో ఫోస్ఫాటిక్‌, పొటాసిక్‌ ఎరువులపై రూ.28,655 కోట్ల రూపాయల నికర సబ్సిడీ అందించే నిర్ణయానికి ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్‌ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఏపీపై కూడా కేంద్రం సబ్సీడీ పెంచింది. డీఏపీపై రూ.438, ఎన్​పీకే గ్రేడ్‌ 3 రకాల ఎరువులపై సంచికి రూ.100 వరకు సబ్సీడీ పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూన్‌లో కూడా డీఏపీపై సబ్సీడీని కేంద్రం 50 కేజీల బస్తాకు 140 రూపాయలకు పెంచింది. మొలాసిస్‌ నుంచి ఉత్పత్తి అయ్యే పొటాష్‌పై ఫస్ట్ టైమ్ సబ్సిడీని అందించాలని కేంద్రం నిర్ణయించింది. 50 కేజీల బస్తాపై రూ.73 సబ్సిడీని నిర్ణయించింది.

పోషకాలతో కూడిన ఎరువుల ధరను 2021 జూన్‌లో పెంచిన కేంద్ర ప్రభుత్వం.. దాని అమలును 2022 మార్చి వరకు కొనసాగించాలని ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. అయితే రేట్లలో మార్పు లేకున్నా అదనపు రాయితీ కోసం ఏక కాలంలో అందించే రూ.6500 కోట్ల వల్ల రీటైల్‌ ధరలు స్ధిరంగా ఉండేందుకు దోహదపడనుంది.

Also Read: బొప్పాయి తోటలో బాలుడి హత్య.. గుండెలవిసేలా రోధిస్తోన్న తల్లి

ఆగని ప్రకంపనలు.. #justasking అంటూ ‘మా’ ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ లేఖ

సినీ ఇండస్ట్రీని దుల్లగొడుతున్న మీనాక్షి చౌదరి..
సినీ ఇండస్ట్రీని దుల్లగొడుతున్న మీనాక్షి చౌదరి..
చలికాలంలో ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో స్పూన్ తేనె తింటే ఏమౌతుంది!
చలికాలంలో ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో స్పూన్ తేనె తింటే ఏమౌతుంది!
జబర్దస్త్ వినోద్ కుమారుడి ఉయ్యాల ఫంక్షన్.. ఫొటోస్ చూశారా?
జబర్దస్త్ వినోద్ కుమారుడి ఉయ్యాల ఫంక్షన్.. ఫొటోస్ చూశారా?
మీ జీమెయిల్‌ అకౌంట్‌ను ఎవరైనా యూజ్‌ చేస్తున్నారని అనుమానంగా ఉందా.
మీ జీమెయిల్‌ అకౌంట్‌ను ఎవరైనా యూజ్‌ చేస్తున్నారని అనుమానంగా ఉందా.
మీకు 60 ఏళ్లు ఉన్నా 30 ఏళ్లలాగా కనిపించాలా? ఈ 4 అలవాట్లతో
మీకు 60 ఏళ్లు ఉన్నా 30 ఏళ్లలాగా కనిపించాలా? ఈ 4 అలవాట్లతో
పెరిగిన దేశీయ విమానయాన ప్రయాణికులు.. అక్టోబర్‌లో వృద్ధి ఎంతంటే?
పెరిగిన దేశీయ విమానయాన ప్రయాణికులు.. అక్టోబర్‌లో వృద్ధి ఎంతంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌‌పై క్లారిటీ
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌‌పై క్లారిటీ
ఇన్‌స్టాలో మీ లైక్స్‌ కనిపించకూడదా.? ఈ సెట్టింగ్ మార్చేస్తే సరి..
ఇన్‌స్టాలో మీ లైక్స్‌ కనిపించకూడదా.? ఈ సెట్టింగ్ మార్చేస్తే సరి..
మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండా సురేఖ.. ఏం చేసిందో తెలిస్తే..
మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండా సురేఖ.. ఏం చేసిందో తెలిస్తే..
శుక్రయాన్-1 కు ఇస్రో రెడీ.. కేంద్రం ఆమోదం.. ప్రయోగం ఎందుకో తెలుసా
శుక్రయాన్-1 కు ఇస్రో రెడీ.. కేంద్రం ఆమోదం.. ప్రయోగం ఎందుకో తెలుసా