Prakash Raj: ఆగని ప్రకంపనలు.. #justasking అంటూ ‘మా’ ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ లేఖ

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్  'మా'..లో ఫైటింగ్‌కి ఇప్పట్లో ఎండ్‌కార్డ్ పడేలా లేదు. మోనార్క్‌ ఇప్పుడే ప్రశ్నించడం మొదలెట్టాడు.

Prakash Raj: ఆగని ప్రకంపనలు.. #justasking అంటూ 'మా' ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ లేఖ
Prakash Raj
Follow us

|

Updated on: Oct 14, 2021 | 4:36 PM

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్  ‘మా’..లో ఫైటింగ్‌కి ఇప్పట్లో ఎండ్‌కార్డ్ పడేలా లేదు. మోనార్క్‌ ఇప్పుడే ప్రశ్నించడం మొదలెట్టాడు. ‘మా’ ఎన్నికల్లో మోహన్‌బాబు రౌడీయిజం, బూతుపురాణాన్ని హైలైట్ చేస్తూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో జరిగిన గొడవకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ను కోరారు. వీలైనంత త్వరగా గొడవకు సంబంధించిన ఫుటేజ్ ఇవ్వాలని కోరారు. లేదంటే అది డిలీట్ చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కొందరు సభ్యలను శారీరకంగా గాయపరిచినట్లు ప్రకాశ్ రాజ్ లేఖలో పేర్కొన్నారు. మోహన్ బాబు, నరేష్ సభ్యలుపై దాడులు చేసినట్లు ఆరోపించారు. అన్ని చోట్లా సీసీ కెమెరాలు పెట్టినట్లు చెప్పారు కాబట్టి.. ప్రతి ఒక్కరూ వ్యవహరించిన తీరు అందులో రికార్డ్ అవుతుందని..  ఆ ఫుటేజ్ బయటకు వస్తే అసలు విషయాలు తెలుస్తాయన్నారు. ఈసీ విచక్షణాధికారాలను ఉపయోగించుకుని వారిని పోలింగ్ ఏరియాలోకి అనుమతించారు. కానీ ఎన్నికల జరిగిన తీరు.. అక్కడ జరిగిన ఘటనలతో జనంలో నవ్వుల పాలయ్యామన్నారు. కొందరు ప్రముఖుల ప్రవర్తనతో తమకు తీవ్ర అసహనం కలిగిందన్నారు. సీసీ ఫుటేజ్ మొత్తం విడుదల చేయాలని కోరారు ప్రకాష్‌ రాజ్‌.

ఎన్నికలకు సంబంధించిన ప్రతీ సమాచారం అడిగి తెలుసుకునే హక్కు తమకుందన్నారు ప్రకాష్‌రాజ్‌. పోలింగ్‌ ఆఫీసర్‌గా అన్ని రికార్డుల్ని మూడు నెలల పాటు భద్రపరచాల్సిన డ్యూటీ ఈసీదని గుర్తు చేశారు.

Also Read: బాలయ్య సలహా.. ఇప్పుడు నా అజెండా అదేనన్న మంచు విష్ణు