Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Drugs Case: ముంబై డ్రగ్స్ కేసులో షారూఖ్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు జైలా..బెయిలా..? కాసేపట్లో తేల్చనున్న కోర్టు..!

Mumbai Drug Bust Case: ముంబై డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరగుతోంది. ప్రముఖ నటుడు షారూఖ్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు జైలా..బెయిలా..? అన్న అంశం మరికాసేపట్లో తేలబోతోంది.

Mumbai Drugs Case: ముంబై డ్రగ్స్ కేసులో షారూఖ్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు జైలా..బెయిలా..? కాసేపట్లో తేల్చనున్న కోర్టు..!
Mumbai Drug Bust Case
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 14, 2021 | 3:18 PM

Mumbai Drug Bust Case: ముంబై డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరగుతోంది. ప్రముఖ నటుడు షారూఖ్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు జైలా..బెయిలా..? అన్న అంశం మరికాసేపట్లో తేలబోతోంది. ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై వరుసగా రెండో రోజు కూడా ముంబై సెషన్స్ కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌ను మరోసారి వ్యతిరేకించారు ఎన్సీబీ తరపు న్యాయవాది . ఇవాళ ఆర్యన్‌కు బెయిల్‌ రాకపోతే అక్టోబర్‌ 19 అంటే మరో ఐదు రోజులు జైలులో ఉండాల్సి ఉంటుంది.

ఆర్యన్‌ డ్రగ్స్‌కు బానిస అని , క్రూయిజ్‌లో దొరికిన డ్రగ్స్‌ ఆర్యన్‌ కోసమే తీసుకొచ్చారని ఎన్పీబీ తాజాగా వాదించింది. దీనిపై కోర్టులు సాక్ష్యాలు ఇచ్చినట్టు తెలిపింది. ఇంటర్నేషనల్‌ డ్రగ్‌ పెడ్లర్స్‌తో ఆర్యన్‌కు సంబంధాలు ఉన్నాయని , విదేశాల నుంచి భారీగా డ్రగ్స్‌ తెప్పించేందుకు ఆర్యన్‌ ప్రయత్నిస్తున్నడని ఎన్సీబీ సంచలన ఆరోపణలు చేసింది. ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై న్యాయమూర్తి ఏ తీర్పు ఇవ్వబోతున్నారన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ముంబై డ్రగ్స్‌ కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. క్రూయిజ్‌ దగ్గర ఆర్యన్‌ను దిగబెట్టిన షారూఖ్‌ డ్రైవర్‌ను ఎన్సీబీ విచారించింది. అయితే, ఆర్యన్‌ను పార్టీకి తీసుకెళ్లిన వాళ్లను ఎన్సీబీ విచారించకుండా ఎందుకు వదిలేసిందని ప్రశ్నించారు మహారాష్ట్ర మంత్రి నవాబ్‌మాలిక్‌. అయితే, డ్రైవర్‌ స్టేట్‌మెంట్‌ను ఎన్సీబీ రికార్డు చేసింది. ముంబై సెషన్స్ కోర్టులో మరోసారి ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించనుంది.

ఇదిలావుంటే. ఆర్యన్‌ఖాన్‌ ఫ్రెండ్‌ అర్బాజ్‌ తన షూలో దాచిన 6 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పంచనామాలో పేర్కొంది ఎన్సీబీ. మీ దగ్గర ఏమైనా డ్రగ్స్ ఉన్నాయాని ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్‌ను ప్రశ్నించగా..డ్రగ్స్ ఉన్నాయని అర్బాజ్ మర్చంట్ అంగీకరించాడని ఎన్‌సీబీ అధికారులు పంచమనాలో స్పష్టం చేశారు. కిరణ్‌ గోసావి, ప్రభాకర్‌ రఘోజిసేన్‌ అనే ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల సమక్షంలో ఆర్యన్‌, అర్బాజ్‌ల వాంగ్మూలాలతో కేసు పంచానామాను రూపొందించినట్టు తెలుస్తోంది.

డ్రగ్స్‌ కేసులో 11 మందిని అరెస్ట్‌ చేసి ముగ్గురిని వదిలేశారని మహారాష్ట్ర మంత్రి ఆరోపించారు. బీజేపీ నేత దగ్గరి బంధువు రిషబ్‌ సచ్‌దేవా, ప్రతీక్‌ గాబా, ఇమ్రాన్‌ ఎన్సీబీ కార్యాలయం బయటకు వస్తున్న వీడియోను విడుదల చేశారు నవాబ్‌ మాలిక్‌. క్రూయిజ్‌లో బీజేపీ అగ్రనేత బంధువు రిషబ్‌ సచ్‌దేవా ఉన్నారని.. రిషబ్‌ను వదిలేసి ఆర్యన్‌ను అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు. దీనిపై ఎన్సీబీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు నవాబ్‌ మాలిక్‌. అసలు క్రూయిజ్‌ పార్టీకి ఆర్యన్‌ను తీసుకెళ్లిందే ప్రతీక్‌ గాబా , ఇమ్రాన్‌ ఫర్నీచర్‌ వాలా అని ఆరోపించారు నవాబ్‌ మాలిక్‌. అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదంటున్నారు ఎన్సీబీ అధికారులు.

అయితే క్రూయిజ్‌ దగ్గర ఆర్యన్‌ పట్టుబడ్డ సమయంలో ఎన్సీబీ అధికారులు మెడికల్ టెస్ట్‌లు చేయకపోవడంపై వివాదం నెలకొంది. మెడికల్‌ టెస్టుల్లో నెగెటివ్‌ వస్తే విడుదల చేయాల్సి ఉంటుంది. పాజిటివ్‌ వచ్చిన వాళ్ల పైనే కేసు నమోదవుతుంది. రైడ్‌ జరిగిన సమయంలో ఆర్యన్‌ డ్రగ్స్‌ సేవించలేదని, మెడికల్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వస్తుందన్న అనుమానంతో ఎన్సీబీ అలా చేసినట్టు చెబుతున్నారు.

Read Also… Clever people: పుట్టుకతోనే తెలివితేటల్ని వరంగా పొందే నాలుగు రాశుల వారున్నారు.. మీ పిల్లల రాశులు వాటిలో ఉన్నాయా?