Chittoor District: బొప్పాయి తోటలో బాలుడి హత్య.. గుండెలవిసేలా రోధిస్తోన్న తల్లి

అభం శుభం తెలియని అమాయక బాలుడు. చూడగానే ముద్దు చేయాలనిపించే చిన్న పిల్లవాడు. అలాంటి బాలుడు బొప్పాయి తోటలో శవమై తేలాడు.

Chittoor District: బొప్పాయి తోటలో బాలుడి హత్య.. గుండెలవిసేలా రోధిస్తోన్న తల్లి
Boy Murder
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 14, 2021 | 3:29 PM

అభం శుభం తెలియని అమాయక బాలుడు. చూడగానే ముద్దు చేయాలనిపించే చిన్న పిల్లవాడు. అలాంటి బాలుడు బొప్పాయి తోటలో శవమై తేలాడు. ఈ హత్యకు కారణమేంటి? ఒక చిన్న పిల్లాడ్ని పట్టుకుని గొంతు పిసికి చంపేంత గొడవలేంటి? ఇదే ప్రస్తుతం పీలేరు ప్రాంతంలో చర్చ. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన నాగిరెడ్డి, జ్యోతి.. వీరికి ఎనిమిదేళ్ల తేజేష్ అనే కొడుకు. తేజేష్ తల్లిదండ్రులు కుటుంబ పోషణకై కువైట్ వెళ్లి సంపాదించాలనుకున్నారు. ఇందుకు తమ దగ్గర డబ్బు లేక పోవడంతో.. వడ్డీ వ్యాపారులైన రవీంద్రరెడ్డి, భూదేవిరెడ్డి దగ్గర ఐదేళ్ల క్రితం అప్పు చేశారు. ఆ డబ్బుతో కువైట్ వెళ్లారు. అక్కడ సంపాదించిన డబ్బులతో ఇక్కడ అప్పిచ్చిన వాళ్లకు వడ్డీ కడుతూ వచ్చారు. ఇప్పటి వరకూ తాము రెండు లక్షల రూపాయల వరకూ కట్టామనీ.. వడ్డీ కూడా సెటిల్ చేస్తామని చెప్పామనీ.. అయినా సరే వాళ్లు తమపై కక్ష కట్టారనీ.. మా పిల్లాడ్ని కడతేర్చేశారనీ వాపోతుందామె. .ఇలాంటోళ్లను ఉరి తీయాలని డిమాండ్ చేస్తోందా కన్నతల్లి.

ఇక్కడ దారుణమేంటంటే.. ఒకే ఊరు- ఒకే కులం మాత్రమే కాదు.. అప్పు ఇచ్చిన వాళ్లు.. బాధిత కుటుంబానికి బంధువులు కూడా. తల్లి ఆరోపిస్తున్నట్టు ఇందులో వడ్డీ ఇచ్చినోళ్ల తప్పే ఉందా? లేక ఈ కడుపుకోత వెనక మరేదైనా దాగి ఉందా? అన్నది తేలాల్సి ఉంది.  ఏది ఏమైనా.. ఒక అమాయక బాలుడైతే అన్యాయంగా ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు ఆర్ధిక లావాదేవీలే కారణమా? లేక కుటుంబ కక్షలే రీజన్లై ఉంటాయా? ఏం జరిగింది? అన్న ఉత్కంఠ నడుస్తోంది.

కొడుకు మరణ వార్త విన్నవెంటనే తల్లిదండ్రులు కువైట్ నుంచి హుటాహుటిన పీలేరు చేరుకున్నారు. కన్నపేగు బంధం తెగడంతో.. గుండెలవిసేలా ఏడుస్తున్న ఆ తల్లిని చూసి.. చుట్టుపక్కల వాళ్లు కూడా.. రోదిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కాళ్ళ పై పడి వేడుకున్న తల్లి జ్యోతి వేడుకున్న విదానం అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది. ఎన్నో పూజల చేస్తే పుట్టిన ఒకానొక కొడుకును దుర్మార్గులు పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకీ ఈ పసివాడి ప్రాణం తీసిన పాపాత్ములెవరు? కుటుంబమా? ఆర్ధికమా? పిల్లాడి ప్రాణం తీసేంత కక్షలూ కార్పణ్యాల కుట్ర కోణమేంటి? అన్నది పోలీసుల విచారణలో తేలనుంది. కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని మదనపల్లి డీఎస్పీ రవి మనోహరా ఆచారి తెలిపారు.

Also Read: బాలయ్య సలహా.. ఇప్పుడు నా అజెండే అదేనన్న మంచు విష్ణు

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..