Fire Accident: నిద్రిస్తుండగా భారీ ప్రమాదం.. 46 మంది అగ్నికి ఆహుతి.. 55 మందికి..
Taiwan Fire Accident: తైవాన్ దేశంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. 55 మంది తీవ్రంగా గాయపడ్డారని.. చాలామంది
Taiwan Fire Accident: తైవాన్ దేశంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. 55 మంది తీవ్రంగా గాయపడ్డారని.. చాలామంది మృత్యువుతో పోరాడుతున్నారని తైవాన్ అధికారులు వెల్లడించారు. దక్షిణ తైవాన్‌లోని కావోసియుంగ్ నగరంలో ఓ 13 అంతస్తుల నివాస సముదాయంలో గురువారం ఉదయం 3 గంటలకు మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఈ అగ్నికీలల్లో చిక్కుకుని ఇప్పటివరకు 46 మంది ప్రాణాలు కోల్పోయారని.. 55 మంది తీవ్రంగా గాయపడినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. నివాస సముదాయంలో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని పేర్కొంటున్నారు.
భవన శిథిలాల్లో చిక్కుక్కున్న వారి కోసం భద్రతా బలగాలు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. భవనంలోని కింది అంతస్తుల్లో మంటలు చెలరేగినట్లు ఫైర్ సిబ్బంది పేర్కొన్నారు. 40 ఏండ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలోని పై అంతస్తుల్లో కుటుంబాలు బస చేస్తుండగా, కింది అంతస్తుల్లో దుకాణ సముదాయాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. అనంతరం దర్యాప్తు చేపడతామని అధికారులు తెలిపారు.
Dozens killed in building fire in China’s Taiwan pic.twitter.com/fWR7H28VoI
— Pitbull (@Willian87420216) October 14, 2021
Also Read: