AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Vishnu: బాలయ్య సలహా.. ఇప్పుడు నా అజెండా అదేనన్న మంచు విష్ణు

తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 'మా' లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు.

Manchu Vishnu: బాలయ్య సలహా.. ఇప్పుడు నా అజెండా అదేనన్న మంచు విష్ణు
Manchu Vishnu Balayya
Ram Naramaneni
|

Updated on: Oct 14, 2021 | 3:32 PM

Share

తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికలు సజావుగా జరగలేదని.. విపరీత ధోరణి ఉన్న మనుషులో కలిసి నడవలేమని ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు రాజీనామా చేశారు. అయినప్పటికీ మంచు విష్ణు తన ఫ్యూచర్ ప్లాన్ త్వరలో చెబుతానంటూ.. ‘మా’ అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకున్నారు. అందర్నీ కలుపుకుని వెళ్తానని చెబుతున్నారు. ఈ క్రమంలో ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి నందమూరి బాలకృష్ణను ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. అండగా నిలిచినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో చిరంజీవిని కూడా కలుస్తానని మంచు విష్ణు వెల్లడించారు.

“మద్దతుగా నిలిచినందుకు బాల అన్నకు ధన్యవాదాలు. అందుకే ఆయన్ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశాను. ఆయన కూడా MAA కోసం ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడని హామీ ఇచ్చాడు. MAA కుటుంబాన్ని ఒక్కటి చేసి.. ఉన్నతి కోసం ఫోకస్ పెట్టమని నాకు సలహా ఇచ్చారు. ఇదే ప్రస్తుతం నా ఎజెండా” అని మంచు విష్ణు పేర్కొన్నారు.

కాగా మోహన్ బాబు కూడా ఇదే విషయాన్ని తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బాలయ్య అల్లుడికి వ్యతిరేకండా ప్రచారం చేశామని.. అయినప్పటికీ అతడు అవేమీ మనుసులో పెట్టుకోకుండా మంచు విష్ణుకు మద్దతుగా నిలిచి ఓటు వేశాడని తెలిపారు. అందుకే బాలయ్యను మొదట కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు వెల్లడించారు.

Also Read: Maha Samudram Review: ప్రేమ… స్నేహం… బంధం… బాధ్యతల కలయిక ‘మహా సముద్రం’