Ayodhya: అయోధ్యలో కలకలం.. దుర్గా పూజ మండపం వద్ద కాల్పులు.. ఒకరు మృతి..
Shooting at Ayodhya Durga Puja pandal: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కాల్పులు కలకలం రేపాయి. దుర్గా పూజ మండపంలో కాల్పులు జరిపిన ఘటనలో ఒక వ్యక్తి మరణించగా,
Shooting at Ayodhya Durga Puja pandal: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కాల్పులు కలకలం రేపాయి. దుర్గా పూజ మండపంలో కాల్పులు జరిపిన ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, ఇద్దరు బాలికలు గాయపడ్డారు. అయోధ్యలోని కోర్ఖానా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం రాత్రి కోర్ఖానా ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుర్గా పూజ మండపం వద్దకు నలుగురు వ్యక్తులు వాహనాల్లో వచ్చారు. అనంతరం పూజ మండపం వద్ద ఉన్న ఒక వ్యక్తిపై వారు అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా, ఆయన కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం మేరకు అక్కడకు చేరకున్న పోలీసులు ముందుగా.. వారిని అయోధ్య జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం లక్నో ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే.. కాల్పులు జరిపిన నలుగురు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసినట్లు అయోధ్య పోలీసులు తెలిపారు. నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగతా ముగ్గురిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. దీనిలో భాగంగా నాలుగు పోలీస్ బృందాలను సైతం ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఎస్‌పీ శైలేష్ పాండే చెప్పారు. దుర్గా పూజ నేపథ్యంలో ఈ కాల్పుల ఘటన జరిగినట్లు మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన కొట్టిపారేశారు. వ్యక్తిగత వివాదం వల్ల ఈ ఘటన జరిగిందని, కారణం ఏమిటన్నది త్వరలోనే వెల్లడవుతుందని వివరించారు. దర్యాప్తు చేపట్టామని.. ఈ ఘటనను వేరే కోణంలో చూడొద్దంటూ సూచించారు.
Also Read: