Super Mechanic Contest: మెకానిజంలో మీ ప్రతిభను వెలికి తీయాలనుందా..? కాస్ట్రోల్‌, టీవీ9 నెట్‌వర్క్‌ గొప్ప అవకాశం

Super Mechanic Contest: సమాజంలో మంచి టాలెంట్‌ ఉన్నవారు ఎందరో ఉన్నారు. మంచి టాలెంట్‌ ఉండి కూడా తమ ప్రతిభను బయట పెట్టలేకపోతున్నారు..

Super Mechanic Contest: మెకానిజంలో మీ ప్రతిభను వెలికి తీయాలనుందా..? కాస్ట్రోల్‌, టీవీ9 నెట్‌వర్క్‌ గొప్ప అవకాశం
Castrol Super Mechanic
Follow us
Subhash Goud

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 14, 2021 | 8:28 PM

Super Mechanic Contest: సమాజంలో మంచి టాలెంట్‌ ఉన్నవారు ఎందరో ఉన్నారు. మంచి టాలెంట్‌ ఉండి కూడా తమ ప్రతిభను బయట పెట్టలేకపోతున్నారు చాలా మంది. మన శరీరంలో ఏదైనా ఆనారోగ్యం సంభవిస్తే దానిని బాగు చేసేందుకు వైద్యులు ఎంత అవసరమో.. మన వాహనంలో కూడా ఏదైనా సమస్య ఉంటే దానిని పరిష్కరించేందుకు మెకానిక్‌ కూడా అంతే అవసరం. ఎంతో మంది ప్రతిభగల మెకానిక్‌లు ఉన్నారు. కానీ వారికి సరైన వేదిక లేక ప్రతిభను బయటపెట్టలేకపోతున్నారు. అలాంటి వారికి టీవీ9 నెట్‌వర్క్‌ మరియు కాస్ట్రోల్‌ ఆధ్వర్యంలో సూపర్‌ మెకానిక్‌గా మారడానికి ఈ వేదిక  ఎంతగానో ఉపయోగపడనుంది. కాస్ట్రోల్‌ సూపర్‌ మెకానిక్‌ పోటీ, మెకానిక్స్‌ నైపుణ్యాలను వెలికి తీసేందుకు మంచి అవకాశం రాబోతోంది. ఇందులో మెకానిక్‌ రంగంలో ఉన్న వారు తమ తమ నైపుణ్యాలను బయటపెట్టుకోవచ్చు. అలాంటి వారికి టీవీ9 నెట్‌ వర్క్‌, కాస్ట్రోల్‌ మంచి అవకాశం కల్పిస్తోంది.

మెకానిక్‌ నైపుణ్యాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్‌ను కండక్ట్‌ చేస్తోంది. ప్రతి ఏడాది కాస్ట్రోల్‌ ఒక సూపర్‌ మెకానిక్‌ పోటీని నిర్వహిస్తోంది. ఇక్కడ వారు తమ తమ ప్రతిభను నిరూపించుకోవచ్చు. అలాంటి మెకానిక్‌లకు సమయం ఆసన్నమైంది. ఈ ఇందులో పాల్గొనే వారు తమ ప్రతిభను నిరూపించుకుని మంచి మెకానిక్‌గా మారవచ్చు.

ఈ సందర్భంగా కాస్ట్రోల్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ సంగ్వాన్‌ మాట్లాడుతూ.. ఇందులో భాగంగా మెకానిక్‌ల ప్రతిభను వెలికి తీసేందుకు వర్చువల్‌ క్లాసులు ప్రారంభించడం జరుగుతుందని, భౌతిక దూరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇందులో నిష్ణతులైన నిపుణులతో మెకానిక్‌లు సలహాలు, సూచనలు పొందవచ్చు. ఏదైనా సందేహాలున్నా ఈ వేదికగా అడిగి తెలుసుకోవచ్చు అని అన్నారు. ఇందులో పాల్గొనే మెకానిక్‌లు అడిగే ప్రశ్నలకు నిపుణులు సరైన సమాధానం ఇస్తారు. ఈ వేదిక ద్వారా  కొత్త కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది అని అన్నారు.

అలాగే కాస్ట్రోల్‌ ఇండియా మార్కెటింగ్‌ విపి జయ జమారాణి మాట్లాడుతూ.. టీవీ9 న్యూస్‌ నెట్‌వర్క్‌ దేశంలో మొదటి స్థానంలో ఉందని, టీవీ9 నెట్‌వర్క్‌ ద్వారా కాస్ట్రోల్‌ సూపర్‌ మెకానిక్‌ కాంటెస్ట్‌ నిర్వహిస్తోందని, ఈ ప్రోగ్రాం దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరింపజేయడమే లక్ష్యమని అన్నారు.

ఈ సందర్భంగా టీవీ9 నెట్‌ వర్క్‌ సీఈవో వరుణ్‌ దాస్‌ మాట్లాడుతూ.. ఈ వేదిక ద్వారా దేశంలో ఉన్న మెకానిక్‌లు నైపుణ్యాభివృద్ధిని పెంపొందించుకోవడం ఎంతో అవసరమని, తమతమ ప్రతిభను వెలికి తీసే సమయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ప్రాజెక్టులో ఇదొక నైపుణ్యాభివృద్ధి. దీని ద్వారా సాధారణ వ్యక్తులు కూడా తమ ప్రతిభను మెరుగు పర్చుకోవడమే కాకుండా సంపాదించుకునేందుకు ఒక మార్గాన్ని తెలుసుకోవచ్చని అన్నారు.

అలాగే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. కాస్ట్రోల్‌ సూపర్‌ మెకానిక్‌ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం ప్రశంసించారు. టీవీ9 నెట్‌వర్క్‌, కాస్ట్రోల్‌ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేయడం వల్ల మెకానిక్‌లలో దాగివున్న ప్రతిభను బయటకు తీయవచ్చని అన్నారు. ఈ వేదిక వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

ఇందులో పాల్గొనాలంటే..

ఈ సూపర్ మెకానిక్‌లో పాల్గొని తమ ప్రతిభను వెలికి తీసి కాస్ట్రోల్‌ సూపర్‌ మెకానిక్‌గా మారవచ్చు. అలాంటి వారు ఇందులో పాల్గొనాలంటే 18005325999కు ఫోన్‌ కాల్‌ చేయవచ్చు. లేదా castrolsupermechaniccontest.in కి లాగిన్ ద్వారా కూడా తమ పేరును నమోదు చేసుకోవచ్చు. నవంబర్‌ 30లోగా ప్రతిభ కలిగిన మెకానిక్‌లు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి:

Facebook: ఫేస్‌బుక్‌ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక లైవ్ ఆడియో రూమ్స్.. వీరికి మాత్రమే అనుమతి..!

Fact Check: వాట్సాప్‌ రాత్రి 11.30 నుంచి ఉదయం 6 గంటల వరకు నిలిచిపోనుందా..? ఇందులో నిజమెంత..?