Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Crime: సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకున్న కర్ణాటక మాజీ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్‌.. అలా ఎలా జరిగిందబ్బా.. !

సైబర్ కేటుగాళ్లు ఇంటర్నెట్ మాటునా సర్వం దోచేస్తున్నారు. మనిషి కనిపించకుండా మొత్తం మాయం చేస్తున్నారు. వీళ్లు వాళ్లు అనే తేడా లేకుండా అందరి జేబులకు చిల్లులు పెడుతున్నారు.

Cyber Crime: సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకున్న కర్ణాటక మాజీ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్‌.. అలా ఎలా జరిగిందబ్బా.. !
Cyber Crime
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 14, 2021 | 7:21 PM

Cyber Crime: సైబర్ కేటుగాళ్లు ఇంటర్నెట్ మాటునా సర్వం దోచేస్తున్నారు. మనిషి కనిపించకుండా మొత్తం మాయం చేస్తున్నారు. వీళ్లు వాళ్లు అనే తేడా లేకుండా అందరి జేబులకు చిల్లులు పెడుతున్నారు. తాజా ఏకంగా కర్ణాటక మాజీ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్‌ను టార్గెట్ చేసి.. లక్ష రూపాయాల దాకా కాజేశారు. అప్రమత్తమైన సదరు మాజీ పోలీసు ఉన్నతాధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటక మాజీ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్‌ ఎంబీ శంకర్ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకుని, రూ.89 వేలు పోగొట్టుకున్నారు. బ్యాంకుకు సంబంధించి గుర్తింపు వివరాలను ఆధునికీకరించుకోవాలని నమ్మబలికి మోసానికి పాల్పడ్డారు. డిటెయిల్ష్ అప్‌డేట్ చేసుకోకుంటే బ్యాంకు ఖాతాను బ్లాక్ చేస్తామని మోసగాళ్లు బెదిరించడంతో, వారికి అన్ని వివరాలు ఫోన్‌లోనే చెప్పేశారు. ఇదే అదునుగా కేటుగాళ్లు శంకర్ ఖాతా నుంచి రూ.89 వేలు మరో ఖాతాలోకి బదిలీ చేసుకున్నారు. జరిగిన మోసాన్ని గ్రహించిన ఆయన.. సౌత్ ఈస్ట్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

శంకర్ అక్టోబరు 11న ఇచ్చిన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం, నో యువర్ కస్టమర్ (కేవైసీ – మీ కస్టమర్ గురించి తెలుసుకోండి) వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని ఆయన ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ఈ వివరాలను అప్‌డేట్ చేయనిపక్షంలో బ్యాంకు ఖాతాను బ్లాక్ చేస్తామని ఆ మెసేజ్‌లో హెచ్చరించారు. కాసేపటికి ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను బ్యాంకు అధికారినని చెప్పాడు. తాను కేవైసీ వివరాలను అప్‌డేట్ చేస్తానని, ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్)ని చెప్పాలని కోరాడు. దీంతో శంకర్ తన ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఆ వ్యక్తికి చెప్పారు. కొద్ది నిమిషాల్లోనే తన బ్యాంకు ఖాతా నుంచి రూ.89,000 వేరొక బ్యాంకు ఖాతాకు బదిలీ అయినట్లు గుర్తించారు. వెంటనే శంకర్ సంబంధిత బ్యాంకుకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంకర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ లావాదేవీని స్తంభింపజేయాలని బ్యాంకు అధికారులను కోరినట్లు చెప్పారు.

ఇదిలావుండగా, శంకర్ ఈ ఏడాది మార్చిలో కూడా సైబర్ నేరగాళ్ల మోసానికి బలైపోయినట్లు తెలుస్తోంది. సైబర్ నేరగాళ్ళు ఆయన వ్యక్తిగత ఈ-మెయిల్ అకౌంట్‌ను దుర్వినియోగం చేసి, ఆయన స్నేహితుల నుంచి రూ.25,000 కొట్టేశారని సమాచారం.

Read Also….  Mysore Palace: అంగరంగ వైభవంగా మైసూర్‌ దసరా ఉత్సవాలు.. విద్యుత్ దీపాల కాంతులతో వెలిగిపోతున్న ప్యాలెస్‌