Crime News: ప్రియుడితో కలిసి ప్లాన్.. భర్తను చంపిన భార్య.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
Wife Kills Husband: హైదరాబాద్ నగరంలో వరుసగా దారుణ సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత కట్టుకున్న భర్తను దారుణంగా చంపింది. ఈ ఘటన
Wife Kills Husband: హైదరాబాద్ నగరంలో వరుసగా దారుణ సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత కట్టుకున్న భర్తను దారుణంగా చంపింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో వెలుగులోకి వచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకోని పోలీసులే షాకయ్యారు. గచ్చిబౌలిలో రెండురోజుల క్రితం గోపన్‌పల్లి తండాకు చెందిన శంకర్ (30) హత్య జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం బంధువుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
శంకర్‌ను అతని భార్య జ్యోతి చంపించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆమెకు మాణిక్యం అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని.. ఈ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడన్న నేపంతో హత్యచేసినట్లు పోలీసులు గుర్తించారు. ముందుస్తుగా మాణిక్యం, జ్యోతి ఇద్దరూ కలిసి శంకర్ ను చంపేందుకు ప్లాన్ చేశారని పేర్కొన్నారు. మాణిక్యం సహాయంతో శంకర్ ను చంపించిందని పోలీసులు నిర్ధారించారు. నిందితులు జ్యోతి, మాణిక్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు.
Also Read: