Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maoist Ramakrishna: మావోయిస్ట్‌ అగ్రనేత రామకృష్ణ కన్నుమూత.. అనారోగ్యంతో RK మృతి!

మావోయిస్ట్‌ దళంలో పెద్ద కుదుపు. అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ మృతి

Maoist Ramakrishna: మావోయిస్ట్‌ అగ్రనేత రామకృష్ణ కన్నుమూత.. అనారోగ్యంతో RK మృతి!
Maoist Leader Ramakrishna
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 14, 2021 | 8:44 PM

Maoist Leader Ramakrishna: మావోయిస్ట్‌ దళంలో పెద్ద కుదుపు. అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్‌కే తుది శ్వాసవిడిచారు. పోలీసుల హిట్‌లిస్ట్‌లో ఉన్నా ఆర్‌కే కన్నుమూసినట్లు చత్తీస్ఘడ్ డీజీపీ తెలిపారు.

మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు రామకృష్ణ తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలో అనారోగ్యంతో మృతి చెందారాయన. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఆర్కే బాధపడుతున్నారు. ఆయన కరోనాతో మృతి చెందినట్లు, అంత్యక్రియలు కూడా పూర్తైనట్లు అధికారులు పోలీసులు ప్రకటించారు. ఆయన తుదిశ్వాస విడవడంతో మావోయిస్టు పార్టీ పెద్ద దిక్కును కోల్పోయినట్టయింది.

మావోయిస్ట్ దళంలో వ్యూహంలో రచించడంలో రామకృష్ణ మంచి దిట్ట. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2004 అక్టోబర్ 15న ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొన్నారు. అనేక మార్లు పోలీసుల నుంచి తప్పుకున్న రామకృష్ణ.. అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు.. కాని మావోలు ధృవీకరించాల్సి ఉంది.

దేశవ్యాప్తంగా పలు కేసుల్లో ఆర్కే ప్రధాన సూత్రధారుడిగా ఉన్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఏపీ, తెలంగాణలో జరిగిన ఎదురు కాల్పుల్లో పలు దఫాలుగా పోలీసుల నుంచి తప్పించుకున్నారు. నాలుగేళ్ల క్రితం బలిమెల ఎన్‌కౌంటర్‌లో ఆయనకు బుల్లెట్ గాయం అయింది. గతంలో ఆర్కేపై రూ.50 లక్షల రివార్డును కూడా ప్రకటించింది పోలీస్ శాఖ. నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఆర్కే కొనసాగారు. సౌత్‌లో మావోయిస్టు పార్టీ బలోపేతానికి తీవ్రంగా పోరాటం చేశారు రామకృష్ణ.

కరోనా మావో దళానికి భారీ నష్టాన్ని మిగిల్చింది. రామకృష్ణను కూడా కరోనానే మింగింది. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ముప్పు తిప్పలు పెడుతున్న క్రమంలో పోలీసులు.. మావోయిస్ట్‌లకు అప్పీల్ చేశారు. లొంగిపోతే.. వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. కాని ఈ పిలుపునకు కొందరే స్పందించారు. మావో దళంలో 20 ఏళ్లుగా యాక్టివ్‌గా పని చేస్తున్నారు రామకృష్ణ. ఈ మధ్య కాలంలో సైలెంట్‌గా ఉన్నారు. అయితే ఉన్నట్టుండి ఆర్‌కే చనిపోవడం కలకలం రేపింది. మరో నేతను ఆయన స్థానంలో నియమించాక.. ఆర్‌కే మృతిని మావోయిస్ట్‌లు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. Read Also… Jabardasth Sai Teja: సాయి తేజ నుంచి ప్రియాంక సింగ్‌గా మారడానికి పెద్ద యుద్ధమే చేశా.. తండ్రి అంధుడు.. చూసేవారు లేరంటూ.. 

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!