Weather Alert: కేరళను తాకని నైరుతి రుతుపవాలు.. అప్పుడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ
ఇటీవల నైరుతి రుతుపవనాలు జూన్ 4 న కేరళాను తాకనున్నట్లు భారత వాతావరణం విభాగం ప్రకటించింది. అయితే 4 నాటికి రుతుపవవానాలు ఇంకా కేరళను తాకలేవు. ఈ నేపథ్యంలో ఐఎండీ స్పందించింది. తాము ముందుగా భావించినట్లు రుతుపవనాలు రాలేవని పేర్కొన్నారు.

ఇటీవల నైరుతి రుతుపవనాలు జూన్ 4 న కేరళను తాకనున్నట్లు భారత వాతావరణం విభాగం ప్రకటించింది. అయితే 4 నాటికి రుతుపవవానాలు ఇంకా కేరళను తాకలేవు. ఈ నేపథ్యంలో ఐఎండీ స్పందించింది. తాము ముందుగా భావించినట్లు రుతుపవనాలు రాలేవని పేర్కొన్నారు. మరో మూడు, నాలుగు రోజుల్లో అవి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ అరేబియా సముద్రంలో పడమటి గాలులు పెరుగుతున్నందున పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.
వాటి లోతు కూడా క్రమంగా పెరుగుతోందని తెలిపారు. జూన్ 4న సముద్రమట్టానికి అది 2.1 కిలోమీటర్లు చేరుకుందని.. ఆగ్నేయ అరేబియా సముద్రంలో మేఘాలు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల రుతుపవనాలు కేరళను తాకే పరిస్థితులు మెరుగవుతాయని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. రుతుపవనాలు ఆలస్యంగా వస్తే వర్షకాలం పంటలతో పాటు దేశంలోని మొత్తం వర్షపాతంపై ప్రభావం పడుతుందని మరికొందరు శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..