Weather Alert: మరో ఐదు రోజుల పాటు ఎండలే.. ఆ రాష్ట్రాల్లోనే అధికం.. వాతావరణ శాఖ కీలక ప్రకటన
వేసవి కాలం ముగిసినప్పటికీ దేశంలో ఇంకా ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం పూట బయటకు వచ్చేందుకే ప్రజలు జంకుతున్నారు. జూన్ నెల సగం గడిచినా కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గడం లేదు. ఈసారి నైరుతి రుతుపవనాలు కూడా ఆలస్యంగా రానున్నాయి.

వేసవి కాలం ముగిసినప్పటికీ దేశంలో ఇంకా ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం పూట బయటకు వచ్చేందుకే ప్రజలు జంకుతున్నారు. జూన్ నెల సగం గడిచినా కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గడం లేదు. ఈసారి నైరుతి రుతుపవనాలు కూడా ఆలస్యంగా రానున్నాయి. ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు చోటుచేసుకుంటున్నాయి. రాబోయే ఐదు రోజుల పాటు కొన్ని రాష్ట్రాల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
ముఖ్యంగా ఒడిశా ఛత్తీస్‌గఢ్, కోస్తాంధ్రాల్లో రాబోయే ఐదు రోజులపాటు ఎండలు మండిపోతాయని తెలిపింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ దక్షిణ భాగంలోని వేర్వేరు ప్రాంతాల్లో, పశ్చిమబెంగాల్‌లోని గంగానది పరిసర ప్రాంతాల్లో, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా మరో ఐదు రోజులపాటు ఇప్పటిలాగే ఎండలు కొనసాగుతాయని పేర్కొంది. అలాగే మధ్యప్రదేశ్‌లో మరో రెండు రోజుల పాటు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.