Huzurabad By Election: హుజూరాబాద్‌, బద్వేల్‌ ఉప ఎన్నికలు ఎప్పుడంటే..? క్లారిటీ ఇచ్చిన ఈసీ

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Sep 04, 2021 | 3:06 PM

Mamata Banerjee Bhabinipur : దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో దేశంలో మరో ఉప ఎన్నికల సంగ్రామానికి షెడ్యూల్‌ విడుదలైంది. పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలో

Huzurabad By Election: హుజూరాబాద్‌, బద్వేల్‌ ఉప ఎన్నికలు ఎప్పుడంటే..? క్లారిటీ ఇచ్చిన ఈసీ
Telangana Municipal Election 2021

Mamata Banerjee Bhabinipur : దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో దేశంలో మరో ఉప ఎన్నికల సంగ్రామానికి షెడ్యూల్‌ విడుదలైంది. పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్‌లో 3, ఒడిశాలో ఒక అసెంబ్లీ స్థానంలో ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్‌లో భవానీపూర్, శంషేర్‌గంజ్, జంగీపూర్ నియోజకవర్గాల్లో, ఒడిశాలోని పిప్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే.. సీఈసీ విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం.. ఈ నాలుగు నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 30న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ 6 విడుదల కానుండగా.. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ సెప్టెంబర్ 13గా ఎన్నికల సంఘం ప్రకటించింది.

కాగా.. కరోనా ప్రమాదం పొంచివున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు చేసిన వినతిని దృష్టిలో ఉంచుకొని 31 అసెంబ్లీ స్థానాల్లో, మూడు పార్లమెంటరీ స్థానాల్లో ఎన్నికలను సీఈసీ వాయిదా వేసింది. దీంతో హుజూరాబాద్‌, బద్వేల్‌ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. వరదలు, పండుగలు, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఉప-ఎన్నికలు ఇప్పుడే నిర్వహించవద్దని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 11 రాష్ట్రాలు కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించాయి. పండుగల సీజన్ తర్వాతే ఉప-ఎన్నికలు నిర్వహించాలని ఆయా రాష్ట్రాలు సూచించిన నేపథ్యంలో.. ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. పండుగల అనంతరం హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలు జరగనున్నాయి.

కాగా.. ఇటీవలనే పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల సంగ్రామంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్‌ కాంగ్రెస్‌ మూడోసారి అధికారం చేపట్టింది. బీజేపీ-టీఎంసీ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో తృణముల్‌ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. కాగా.. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. నందిగ్రామ్‌లో బీజేపీ నేత సువేందు అధికారిపై ఓటమి పాలయ్యారు. కాగా.. మమతా ప్రస్తుతం భవనీపూర్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తాజాగా ప్రకటించిన ఉప ఎన్నికల షెడ్యూల్ తో బెంగాల్లో రాజకీయాలు మళ్లీ వెడెక్కనున్నాయి.

Also Read:

Huzurabad By Election: హుజూరాబాద్‌, బద్వేల్‌ ఉప ఎన్నికలు వాయిదా.. బెంగాల్‌లో మమతా సీటుకు గ్రీన్‌ సిగ్నల్‌

Huzurabad Elections: హరీష్ రావు‌పై సంచలన ఆరోపణలు చేసిన ఈటెల.. బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu