Driving License : మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలా?.. ఇలా ఈజీగా మీ ఇంట్లోనే అప్లయ్ చేసుకోండి..
Driving License : ఇంతకాలం డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే చాలా తిప్పలు పడాల్సి వచ్చేది. ఆర్టీవో ఆఫీసుకు వెళ్లి..
Driving License : ఇంతకాలం డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే చాలా తిప్పలు పడాల్సి వచ్చేది. ఆర్టీవో ఆఫీసుకు వెళ్లి.. పడిగాపులు గాయాల్సి వచ్చేది. లెర్నింగ్ లైసెన్స్ పొందాలంటేనే ఆపసోపాలు పడాల్సి వచ్చేసింది. అప్లయ్ చేసుకోవడం.. పరీక్ష రాయడం.. తీరా చూస్తే ఫెయిల్ అవడం లాంటివి జరుగుతుండేవి. ఇవన్నీ తంటాలు ఉండొద్దని చాలా మంది మధ్యవర్తులు/దళారులను ఆశ్రయించేవారు. వారైతే త్వరగా పని చేసి పెడతారనే విశ్వాసం ప్రజల్లో బలంగా ఉంది. అయితే, దళారి వ్యవస్థను రూపుమాపేందుకు, ప్రజల జేబులకు చిల్లు పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యవస్థను తీసుకువచ్చింది. అదే ఆన్‌లైన్ వ్యవస్థ. లైసెన్స్ కావాలనుకునే వారు.. ఇక ఆఫీసుల చూట్టూ తిరగకుండా.. కేవలం ఇంట్లో కూర్చొనే లెర్నింగ్ లైసెన్స్ కోసం అప్లయ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఒక్క లెర్నింగ్ లైసెన్స్ మాత్రమే కాదండోయ్.. పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, అడ్రస్ ఛేంజ్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యవల్ వంటి అనేక సేవలకు ఒకే పోర్టల్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.
మరి ఆన్‌లైన్‌లో ఎలా అప్లయ్ చేయాలి.. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్ ద్వారా అప్లయ్ చేయాలనుకునే వారు. ఈ విధానాన్ని పాటించండి. ముందుగా ప్రభుత్వ వెబ్ సైట్ అయిన https://parivahan.gov.in/ లింక్ ఓపెన్ చేయండి. ఆ తరువాత.. Online Services అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అందులో Driving Licence Related Services.. అనే ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు దానిపై క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తరువాత వేరే పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాన్ని ఎంపిక చేసుకున్న తరువాత మరో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Apply for Learner Licence, Apply for Driving Licence, DL Renewal, Duplicate DL, change of Address అని మరికొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో మీకు ఏ సర్వీస్ కావాలనిపిస్తే దానిని ఎంచుకోవాలి. ఇలా డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్య గమనిక: ఆన్‌లైన్‌లో లైసెన్స్ అప్లయ్ చేసుకునే విధానం ప్రస్తుతానికి కొన్ని రాష్ట్రాల్లోనే అందుబాటులో ఉంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల నిబంధనలకు అనుగుణంగానే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన వారు.. ముందుగా లెర్నింగ్ లైసెన్స్‌కు అప్లయ్ చేయాలి. దాని కోసం ఓ పరీక్ష రాయాలి. అందులో పాస్ అయితేనే లర్నర్ లైసెన్స్ ఇస్తారు. లెర్నర్ లైసెన్స్ ఇచ్చాక.. ఆరు నెలల లోపు పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి వాహనం అయినా సరే డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధానం ఇలాగే ఉంటుంది.
Also read:
Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగి వచ్చిన గోల్డ్ రేటు.. తాజా ధరల వివరాలు
Rains Alerts: తెలంగాణలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
AP-TS Weather Alert: అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్..