Smuggling: ఇది పెయింట్ అనుకున్నారో పప్పులో కాలేసినట్లే.. మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులు ఔటే..!

Smuggling: అధికారులందరినీ షాక్ గురి చేసే ఘటన కేరళలోని కన్నూరు విమానాశ్రయంలో చోటు చేసుకుంది.

Smuggling: ఇది పెయింట్ అనుకున్నారో పప్పులో కాలేసినట్లే.. మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులు ఔటే..!
Gold
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2021 | 6:56 AM

Smuggling: అధికారులందరినీ షాక్ గురి చేసే ఘటన కేరళలోని కన్నూరు విమానాశ్రయంలో చోటు చేసుకుంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా బంగారం అక్రమ రవాణాకు తెరలేపారు స్మగ్లింగ్ మాఫియా. అది చూసి విస్తుపోవడం కస్టమ్స్ అధికారుల వంతయ్యింది. వివరాల్లోకెళితే.. కేరళలోని కన్నూరు విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడిపై అనుమానం రావడంతో కస్టమ్స్, ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు అతన్ని తనిఖీ చేశారు. దాంతో అతను బంగారం దాచిన విధానాన్ని చూసి అధికారులు షాక్ అయ్యారు. బంగారం అక్రమంగా తరలిస్తున్న వ్యక్తి.. ఎవరూ కనిపెట్టకుండా ఉండేందుకు తాను ధరించిన డబుల్ లేయర్ ప్యాంట్ మధ్యలో బంగారం పేస్ట్ పూశాడు. కాగా తనిఖీల్లో అది గమనించిన అధికారులు.. ఆ ప్యాంట్‌ను కట్ చేసి ఓపెన్ చేశారు. అది చూసి అధికారులు విస్తుపోయారు. సుమారు రూ. 14 లక్షల విలువైన 302 గ్రాముల బంగారాన్ని చిక్కని పేస్ట్‌గా మార్చి ఈ డబుల్ లేయర్ ప్యాంట్‌ మధ్యలో దాచిఉంచడాన్ని గుర్తించారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కాగా, ఈ ప్యాంట్‌ లోపలివైపు దాచిన బంగారం పేస్ట్ పొరలకు సంబంధించిన ఫోటోలను అధికారులు ట్వీట్ చేశారు.

ఇదిలాఉంటే.. గత నెలలో అమృత్ సర్ విమానాశ్రయంలో 1,894 గ్రాముల బంగారు పేస్ట్‌ని తన లోదుస్తులలో దాచి అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. షార్జా నుంచి విమానంలో వచ్చిన వ్యక్తిని అదే రోజు అరెస్టు చేశారు. షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడిని తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులు.. అతని లోదుస్తులలో దాచిన 1,894 గ్రాముల బంగారాన్ని పేస్ట్ రూపంలో కనుగొన్నారు. దానిని వెలికితీసి రూ .78 లక్షల విలువైన 1,600 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు.

గత నెలలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బంగారం స్మగ్లింగ్ మాఫియాను అరికట్టాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్రం, దాని ఏజెన్సీలదేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏమీ చేయలేదని చెప్పారు. కస్టమ్స్, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ రాష్ట్ర పరిధిలోకి రాదని ఆయన పేర్కొన్నారు.

Also read:

Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. ఏ జిల్లాకు ఏ కలెక్టర్ అంటే..

Shocking News: హడలెత్తిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. ప్రాణాలు కోల్పోయిన 30 మంది చిన్నారులు..

Supreme Court: మంగళవారం ప్రమాణస్వీకారం చేయనున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తులు..

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..