Raids On RTO Officer: ఆర్టీవో ఇంట్లో సోదాలు.. అక్కడ దొరికిన సొమ్ము చూసి కళ్లు తేలేసిన అధికారులు
Jabalpur: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నగరంలో గురువారం ఆర్థిక నేరాల విభాగం (EOW) అధికారులు ఓ ఆర్టీవో అధికారి ఇంట్లో విస్తృత తనిఖీలు, సోదాలు నిర్వహించారు. సంతోష్ పాల్‌తో పాటు అదే ఆర్టీవో కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తోన్న సతీమణి లేఖాఫాల్‌లపై..
Jabalpur: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నగరంలో గురువారం ఆర్థిక నేరాల విభాగం (EOW) అధికారులు ఓ ఆర్టీవో అధికారి ఇంట్లో విస్తృత తనిఖీలు, సోదాలు నిర్వహించారు. సంతోష్ పాల్‌తో పాటు అదే ఆర్టీవో కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తోన్న సతీమణి లేఖాఫాల్‌లపై ఆదాయానికి ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు. సంతోష్ పాల్‌తో పాటు ఆయన సతీమణికి సంబంధించిన మూడు ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కాగా అక్కడ దొరికిన అక్రమ సొమ్మును చూసి తనిఖీ అధికారులు కళ్లేతేలేశారు. వారి ఆదాయ వనరులతో పోలీస్తే 650 రెట్లు ఎక్కువ సంపాదన ఆర్జించినట్లు తెలిసింది.
కాగా ప్రభుత్వాధికారి అయిన సంతోష్ అక్రమంగా భారీ ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. దీనిపై సమచారమందుకున్న అధికారులు బుధవారం అర్ధరాత్రి ఈ సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో లక్షలాది రూపాయల నగదు, నగలు, కొన్ని పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ దంపతులకు ఐదు ఇళ్లు, ఒక ఫామ్‌హౌస్, ఒక కారు, SUVతో పాటు 2 ద్విచక్ర వాహనాలు ఉన్నాయని తనిఖీ అధికారులు తెలిపారు. అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం పాల్, అతని భార్యపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
Madhya Pradesh | EOW (Economic Offences Wing) raided the residence of Regional Transport Officer Santosh Pal in Jabalpur in connection with disproportionate assets. Bureau has conducted raids at a total of 3 places. Rs 16 lakh cash and jewellery were recovered from his residence. pic.twitter.com/4Yy3jSd9ae
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 18, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..