తొక్కలో ఐపీఎల్.. ప్రజలకంటే ఎక్కువనా..!

కరోనా.. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తున్న వైరస్. దీని దెబ్బకు ఇప్పటికే నాలుగు వేల మందికిపైగా మృతిచెందగా.. లక్షన్నరకు పైగా వైరస్ సోకి ఆస్పత్రిపాలయ్యారు. ఈ క్రమంలో పెద్ద పెద్ద కార్యక్రమాలే కాదు.. క్రికెట్ మ్యాచ్‌లపై కూడా ఈ వైరస్ ఎఫెక్ట్ చూపిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఉన్నవిషయం తెలిసిందే. దీంతో ఈ మార్చి 29న ప్రారంభంకావాల్సిన IPL-2020 సీజన్‌ను.. బీసీసీఐ ఏప్రిల్ 15కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా […]

తొక్కలో ఐపీఎల్.. ప్రజలకంటే ఎక్కువనా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 14, 2020 | 4:21 PM

కరోనా.. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తున్న వైరస్. దీని దెబ్బకు ఇప్పటికే నాలుగు వేల మందికిపైగా మృతిచెందగా.. లక్షన్నరకు పైగా వైరస్ సోకి ఆస్పత్రిపాలయ్యారు. ఈ క్రమంలో పెద్ద పెద్ద కార్యక్రమాలే కాదు.. క్రికెట్ మ్యాచ్‌లపై కూడా ఈ వైరస్ ఎఫెక్ట్ చూపిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఉన్నవిషయం తెలిసిందే. దీంతో ఈ మార్చి 29న ప్రారంభంకావాల్సిన IPL-2020 సీజన్‌ను.. బీసీసీఐ ఏప్రిల్ 15కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా ప్రభావం ఉన్న నేపథ్యంలో మ్యాచ్‌లను నిర్వహించకపోవడమే ఉత్తమమని బాలీవుడ్ హీరో, కోల్‌కతా నైట్ రైడర్స్ వ్యవస్థాపకుడు షారుక్ ఖాన్‌ తెలిపారు. శనివారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పాలక మండలి సమావేశానికి ముందు.. ఫ్రాంఛైజీల ఓనర్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ క్రమంలో షారుక్ తన అధికారిక ట్విట్టర్ వేదికగా పలు అంశాలపై స్పందించారు.

ఆట కంటే ప్రజల భద్రతే ముఖ్యం

”ఆఫ్‌ ది ఫీల్డ్‌’లో అన్ని ఫ్రాంఛైజీల యాజమానులతో భేటీ అవ్వడం అద్భుతంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు, ఆటగాళ్లు, మ్యాచులు జరిగే ప్రజల భద్రతే ముఖ్యమంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు.. కేంద్ర ప్రభుత్వ ఇచ్చే ఆదేశాలను తప్పక పాటించాల్సిందేనని.. కొద్ది రోజుల్లో ఈ వైరస్ వ్యాప్తి తగ్గుతుందని. .ఆ తర్వాత ఐపీఎల్ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల ఈ సందర్భంగా ప్రజలనుద్దేశిస్తూ..తరచూ అందరం చేతులను శుభ్రంగా ఉంచుకుంటూ.. పరిశుభ్రతను పాటిద్ధామంటూ ట్విటర్లో పేర్కొన్నాడు.