AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముసలోడికి మళ్లీ రెక్కలొచ్చాయ్.. కట్ చేస్తే.. కథ దుబాయ్‌లో తేలింది.!

హైదరాబాద్‌కు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు ఇటీవల సైబర్ నేరగాళ్లకు బలయ్యాడు. హనీ ట్రాప్ ద్వారా మాయ చేసి అతని వద్ద నుంచి దాదాపు రూ. 38.73 లక్షలు కాజేశారు. ఈ ఘటన మొదట ఫేస్‌బుక్‌లో మొదలైంది. వృద్ధుడికి ఒక మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. మహిళ తనను తండ్రి వదిలేసి వెళ్లిపోయినట్లుగా, తల్లి ఒక సాధారణ టైలర్‌గా జీవనం సాగిస్తున్నదని పరిచయం చేసుకుంది

ముసలోడికి మళ్లీ రెక్కలొచ్చాయ్.. కట్ చేస్తే.. కథ దుబాయ్‌లో తేలింది.!
Honey Trapped
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Jun 18, 2025 | 3:57 PM

Share

హైదరాబాద్‌కు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు ఇటీవల సైబర్ నేరగాళ్లకు బలయ్యాడు. హనీ ట్రాప్ ద్వారా మాయ చేసి అతని వద్ద నుంచి దాదాపు రూ. 38.73 లక్షలు కాజేశారు. ఈ ఘటన మొదట ఫేస్‌బుక్‌లో మొదలైంది. వృద్ధుడికి ఒక మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. మహిళ తనను తండ్రి వదిలేసి వెళ్లిపోయినట్లుగా, తల్లి ఒక సాధారణ టైలర్‌గా జీవనం సాగిస్తున్నదని పరిచయం చేసుకుంది. తన జీవిత కథను తేలికగా చెప్పి మానవత్వాన్ని రేకెత్తించిన ఆమె, వృద్ధుడితో చాటింగ్ చేయాలంటే ఇంటర్నెట్ సదుపాయం అవసరమని చెప్పారు. ఇందుకోసం ఆమె ఓ కేబుల్ ఆపరేటర్ నంబర్‌ను ఇచ్చింది.

వృద్ధుడు మహిళకు సహాయం చేయాలనే ఉద్దేశంతో, ఆమె సూచించిన కేబుల్ ఆపరేటర్‌కి సంప్రదించి రూ. 10,000 చెల్లించాడు. అయితే, ఈ చెల్లింపు అనంతరం ఆ మహిళ నుంచి ఫేస్‌బుక్‌లో స్పందన లేకపోవడంతో.. వృద్ధుడు అదే కేబుల్ ఆపరేటర్‌తోనే చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. అప్పటికే మోసం మొదలైపోయిందన్న విషయం అతను గ్రహించలేకపోయాడు. కొద్ది రోజుల తర్వాత ఆ మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉందని కేబుల్ ఆపరేటర్ చెప్పాడు. ఆ సమాచారం విని వృద్ధుడు చలించిపోయి, వెంటనే మరో రూ. 10 లక్షలు అతనికి పంపించాడు. ఈ సహాయం అనంతరం కూడా మోసం ఆగలేదు. మళ్లీ వృద్ధుడి క్రెడిట్ కార్డు నుంచి మరో రూ. 2.65 లక్షలు వసూలు చేశారు. ఇది జరిగిన కొద్ది రోజుల తరువాత, ఆ మహిళ ఇప్పటికే దుబాయ్ వెళ్లిపోయిందని, ఇక ఆమెతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవడం సాధ్యం కాదని ఆ కేబుల్ ఆపరేటర్ తెలిపాడు.

ఇంతవరకూ వృద్ధుడు ఇప్పటికే లక్షల్లో డబ్బు కోల్పోయాడు. కానీ మోసం ఇంకా కొనసాగింది. ఆ కేబుల్ ఆపరేటర్ తన తల్లి, సోదరి వృద్ధుడితో మాట్లాడాలని అనుకుంటున్నారని చెప్పాడు. వృద్ధుడు కూడా మాయమాటలు నమ్మి వారికి ఓకే చెప్పాడు. అనంతరం వృద్ధుడు ఆ తల్లి, సోదరి అనే మహిళలతో కొన్ని రోజులపాటు లైంగికంగా చాటింగ్ చేశాడు. ఇదే మలుపుగా మోసగాళ్లు పెద్ద దెబ్బ కొట్టే ప్రయత్నం ప్రారంభించారు. ఒక రోజు ఆ కేబుల్ ఆపరేటర్ వృద్ధుడిని బెదిరించాడు. “మీరు మైనర్ అమ్మాయితో చాటింగ్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తాం” అని హెచ్చరించాడు. వృద్ధుడు భయాందోళనలకు గురయ్యాడు. వెంటనే పోలీస్ కానిస్టేబుల్ పేరుతో మోసగాళ్ళే మరో అకౌంట్‌ నుంచి వృద్ధుడిని సంప్రదించారు. విషయాన్ని సెట్ చేసుకోవాలని చెప్పారు.

అనంతరం మరో మోసపు కథ మొదలైంది. బాలిక చదువులకు డబ్బు కావాలని, ఆమె తల్లి తీసుకున్న డ్వాక్రా రుణాన్ని తీర్చేందుకు సహాయం చేయాలని చెప్పారు. దీనిపై వృద్ధుడు మరొకసారి నమ్మకం చూపించి రూ. 12.5 లక్షలు పంపించాడు. అయినా మోసం ఆగలేదు. అలాగే వృద్ధుడిని మరింత భయపెట్టి, ఒక కానిస్టేబుల్‌, ఎస్సై పేరుతో మళ్లీ నమ్మబలికారు. సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలన్నారు. దాంతో వృద్ధుడు మరో రూ. 1 లక్ష చెల్లించాడు. అంతేకాకుండా, కొత్త ఎస్సై వచ్చాడని, అతడితో కూడా అనుకూలంగా వ్యవహరించాలంటే మరో రూ. 10 లక్షలు ఇవ్వాలని కోరారు. చివరికి మరో రూ. 7 లక్షలు పంపించాడు. ఈ క్రమంలో మొత్తం మొత్తం 38.73 లక్షలు వృద్ధుడు కోల్పోయాడు. తాను మోసపోయినట్లు గ్రహించిన వృద్ధుడు చివరికి నిజమైన పోలీసులను ఆశ్రయించడంతో అసలు వ్యవహారం బయటపడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..