AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Himachal Pradesh: సిమ్లా అడవులలో భారీ అగ్నిప్రమాదం.. సిమ్లా-కల్కా రైల్వే ట్రాక్‌కి చేరుకున్న మంటలు.. పలు రైళ్లు రద్దు..

సిమ్లా-కల్కా రైల్వే ట్రాక్ కూడా ఈ అగ్నిప్రమాదంలో చిక్కుకుంది. ఈ భారీ అగ్నిప్రమాదం దృష్ట్యా ట్రాక్‌పై నడుస్తున్న అన్ని రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. కొన్ని రైళ్లు తారాదేవి స్టేషన్‌లో నిలబడి ఉండగా కొన్ని రైళ్లు కింద నిలిపివేశారు. రైళ్లు కూడా వెళ్లలేని విధంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కల్కా నుంచి బయలుదేరే రైళ్లను తారా దేవి స్టేషన్‌లో నిలిపివేశారు.

Himachal Pradesh: సిమ్లా అడవులలో భారీ అగ్నిప్రమాదం.. సిమ్లా-కల్కా రైల్వే ట్రాక్‌కి చేరుకున్న మంటలు.. పలు రైళ్లు రద్దు..
Shimla Forest Fire
Surya Kala
|

Updated on: May 31, 2024 | 7:36 AM

Share

ఉత్తరాఖండ్ పర్వతాల తర్వాత ఇప్పుడు హిమాచల్‌ ప్రదేశ్ లోనూ మంటలు చెలరేగుతున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్ లోని అడవుల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హిమాచల్ రాజధాని సిమ్లా చుట్టుపక్కల అడవులు మూడు రోజులుగా మండిపోతున్నాయి. ఇప్పుడు మంటలు నివాస ప్రాంతాల వైపు కదులుతున్నాయి. రాజధాని సిమ్లాకు ఆనుకుని ఉన్న తారాదేవి, సమ్మర్‌హిల్‌ అడవుల్లో గురువారం నుంచి భారీగా మంటలు చెలరేగుతున్నాయి.

సిమ్లా-కల్కా రైల్వే ట్రాక్ కూడా ఈ అగ్నిప్రమాదంలో చిక్కుకుంది. ఈ భారీ అగ్నిప్రమాదం దృష్ట్యా ట్రాక్‌పై నడుస్తున్న అన్ని రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. కొన్ని రైళ్లు తారాదేవి స్టేషన్‌లో నిలబడి ఉండగా కొన్ని రైళ్లు కింద నిలిపివేశారు. రైళ్లు కూడా వెళ్లలేని విధంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కల్కా నుంచి బయలుదేరే రైళ్లను తారా దేవి స్టేషన్‌లో నిలిపివేశారు.

తారాదేవి స్టేషన్‌లోనే రైలు ఆగింది

దీంతో రైళ్ల బంద్‌తో పాటు ఆ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరగడంతో ఇక్కడికి వచ్చే ప్రయాణికులు సైతం ఆందోళనకు గురవుతున్నారు. తారాదేవి స్టేషన్‌లో రైలు నాలుగు గంటలపాటు నిలిచిపోయింది. అదే సమయంలో కల్కాకు వెళ్లే రైళ్లను కూడా సిమ్లా రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. సిబ్బంది మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉండగా రోడ్డు లేకపోవడంతో అగ్నిమాపక దళం వాహనాలు అక్కడికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

లక్షల విలువైన అటవీ సంపద దగ్ధం

అగ్నిమాపక దళం వాహనాలు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో మంటలను అదుపు చేయడం చాలా కష్టంగా మారుతోంది. ట్రాక్‌కి ఇరువైపులా చెట్లు కాలిపోవడంతో లక్షల విలువైన అటవీ సంపద కాలి బూడిదవుతోంది. ప్రస్తుతం అడవుల్లో మంటలు చెలరేగడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేసింది రైల్వే శాఖ, మంటలు ఆర్పిన తర్వాతే మళ్లీ రైళ్లను నడపనుంది. వేసవి సెలవుల నేపధ్యంలో దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు రైలు ద్వారా సిమ్లాకు వస్తున్నారు. సిమ్లాకు వెళ్లే రైళ్లన్నీ పూర్తిగా నిండిపోయాయి.

ఉత్తరాఖండ్ అడవుల్లో చెలరేగిన మంటలు

ఉత్తరాఖండ్ అడవుల్లో ఇటీవల భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అగ్నిప్రమాదం చాలా భయంకరంగా ఉంది. ఈ మంటలను ఆర్పడానికి పరిపాలన చాలా రోజులు కష్టపడాల్సి వచ్చింది. అనేక నివాస ప్రాంతాలకు కూడా మంటలు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఉత్తరాఖండ్‌లోని లక్షలాది విలువైన అటవీ సంపద కాలి బూడిదైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్
సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..
కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్
కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్