ప్రేమ కోసం 15ఏళ్ల బాలిక ఘాతుకం.. తండ్రిని, తమ్ముడిని చంపి.. శరీరాలను ముక్కలుగా నరికి..
బెయిల్‌పై విడుదలైన తర్వాత ఇద్దరు కలిసి ఆమె తండ్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నారు. తండ్రి హత్యకు అడ్డుపడ్డ తమ్ముడిని కూడా హతమార్చారు. ఈ రెండు హత్యల తరువాత, వారు దాదాపు మూడు నెలల పాటు పట్టుబడకుండా తప్పించుకున్నారు. కాగా, బాలిక హరిద్వార్‌లో పట్టుబడగా, ముకుల్ ఇంకా పరారీలోనే ఉన్నట్టుగా తెలిసింది.
తన తండ్రి, తమ్ముడిని దారుణంగా హత్య చేసింది ఒక 15 ఏళ్ల బాలిక. తన ప్రేమకు అడ్డుపడుతున్నారనే కోపంతో ఆ ఇద్దరినీ చంపి మృతదేహాలను ముక్కలు చేసి ఫ్రీజర్‌లో దాచిపెట్టంది. మార్చి 15న మైనర్ బాలిక తన 19 ఏళ్ల ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా తప్పించుకుని పారిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘాతుకానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఆ బాలిక ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడింది. రెండున్నర నెలల తరువాత ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో బుధవారం ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో చోటు చేసుకుంది.
రైల్వేలో క్లర్క్‌గా పనిచేసే రాజ్‌కుమార్ విశ్వకర్మ కుమార్తె అయిన ఈ బాలిక ముకుల్ సింగ్ (19) అనే యువకుడితో ప్రేమలో పడింది. 2023 సెప్టెంబరులో ఆ అమ్మాయి ముకుల్‌తో కలిసి పారిపోయింది. దాంతో తల్లిదండ్రులు వారి కోసం గాలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, యువకుడిపై పోక్సో చట్టం కింద అతన్ని అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత ఇద్దరు కలిసి ఆమె తండ్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నారు. తండ్రి హత్యకు అడ్డుపడ్డ తమ్ముడిని కూడా హతమార్చారు. మృతదేహాలను ముక్కలుగా నరికి వాటిని ఫ్రిజ్‌లో ఉంచి పరారయ్యారు. ఈ రెండు హత్యల తరువాత, వారు దాదాపు మూడు నెలల పాటు పట్టుబడకుండా తప్పించుకున్నారు. కాగా, బాలిక హరిద్వార్‌లో పట్టుబడగా, ముకుల్ ఇంకా పరారీలోనే ఉన్నట్టుగా తెలిసింది.
మార్చి 15న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో హత్య జరగగా, అప్పటి నుంచి బాలిక పరారీలో ఉంది. ఆమె 19 ఏళ్ల ప్రియుడు కూడా ఈ కేసులో నిందితుడని, అతడు ఇంకా పరారీలో ఉన్నాడని హరిద్వార్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రమేంద్ర దోభాల్ నివేదించారు. విచారణలో బాలిక అంగీకరించనట్టుగా వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..