Modi in Kanyakumari: బిజీ షెడ్యూల్ మధ్యలో ప్రశాంతత.. 45 గంటల పాటు ధ్యానముద్రలోకి ప్రధాని మోదీ..
భారత ప్రధాన మంత్రి మోదీ రూటే సెపరేట్. లోక్‌సభ ఎన్నకల ప్రచారం ముగియడంతో ఆయన ధ్యాన ముద్రలోకి వెళ్లారు. 2019 ఎన్నికలు ముగిశాక కేదార్‌నాథ్ గుహల్లో ధ్యానం చేసిన మోదీ.. ఈసారి తమిళనాడు కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్‌ను ఎంచుకున్నారు. మే 30వ తేదీ సాయంత్రం మొదలైన ధ్యానం మే31 శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగనుంది.
భారత ప్రధాన మంత్రి మోదీ రూటే సెపరేట్. లోక్‌సభ ఎన్నకల ప్రచారం ముగియడంతో ఆయన ధ్యాన ముద్రలోకి వెళ్లారు. 2019 ఎన్నికలు ముగిశాక కేదార్‌నాథ్ గుహల్లో ధ్యానం చేసిన మోదీ.. ఈసారి తమిళనాడు కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్‌ను ఎంచుకున్నారు. మే 30వ తేదీ సాయంత్రం మొదలైన ధ్యానం మే31 శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగనుంది. వివేకానంద రాక్‌లో ఉన్న ధ్యాన మండపంలో ప్రధాని మోదీ ధ్యాన ముద్రలోకి వెళ్ళారు.
గురువారం ఢిల్లీ నుంచి కన్యాకుమారి చేరుకున్న ప్రధాని మోదీ ముందుగా భగవతీ అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భగవతి అమ్మన్ ఆలయం లోకి సాంప్రదాయ దుస్తుల్లో వచ్చారు మోదీ. అమ్మవారికి ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ, అరటిపండ్లు సమర్పించారు. ఆలయ పూజారులు ప్రధానికి అమ్మవారి చిత్రపటం అందజేశారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కన్యాకుమారిలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఆర్‌పీఎఫ్ బలగాలు ఆ ప్రాంతాన్ని సీజ్ చేశాయి. మోదీ ధ్యానం సమయంలో స్మారక చిహ్నంలోకి పర్యాటకులను అనుమతించరు. 2019 ఎన్నికల ప్రచారం తర్వాత ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లోని రుద్రగుహలో మోదీ 17 గంటలపాటు ధ్యానం చేశారు.
జూన్ 1న ఆయన బయలుదేరే ముందు, ప్రధాని మోదీ స్మారక చిహ్నం పక్కన ఉన్న తిరువల్లువర్ విగ్రహాన్ని కూడా సందర్శించనున్నారు. స్మారక చిహ్నం 133 అడుగుల ఎత్తైన విగ్రహం రెండూ చిన్న ద్వీపాలలో నిర్మించారు. ఇవి సముద్రంలో ఒంటరిగా, మట్టిదిబ్బల వంటి రాతి నిర్మాణాలు కనిపిస్తాయి. స్వామి వివేకానంద పేరిట ఉన్న స్మారకం వద్ద మోదీ 45 గంటలపాటు బస చేసేందుకు భారీ భద్రతతో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ తొలిసారిగా వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద బస చేయనున్నారు. స్వామి వివేకానంద 1892 చివరిలో ఇక్కడ ధ్యానం చేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత, ప్రశాంత వాతావరణంలో ప్రధాని మోదీ ధ్యానం చేస్తున్నారు.
వీడియో చూడండి…
ప్రధాని మోదీ కన్యాకుమారికి చేరుకున్న నేపథ్యంలో.. 32 ఏళ్ల నాటి ఆయన ఫోటో ఒకటి నెట్టింగ చక్కర్లు కొడుతోంది. ఈ ప్రఖ్యాతస్థలం వద్ద ఆయన పర్యటించిన 32 ఏళ్ళ క్రితం ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కన్యాకుమారిలోని వివేకానంద శిలాస్మారకం నుంచే 1991 డిసెంబరు 11న బీజేపీ ఏక్తాయాత్రను ప్రారంభించింది. అప్పటి బీజేపీ నేతలు స్వామి వివేకానందుడి విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఈ యాత్రకు నాయకత్వం వహించిన మురళీమనోహర్ జోషితోపాటు నరేంద్ర మోదీ కూడా ఆ చిత్రంలో కనిపించారు. యాత్ర 14 రాష్ట్రాల మీదుగా ప్రయాణించి 1992 జనవరి 26న శ్రీనగర్‌లో ముగిసింది. ఈ యాత్ర దిగ్విజయంగా సాగడంలో మోదీ తన వంతు పాత్ర పోషించారు.
గురువారం సాయంత్రం నుండి జూన్ 1 సాయంత్రం వరకు, ప్రధానికి ఇష్టమైన ఆధ్యాత్మిక చిహ్నం వివేకానంద ‘భారత మాత’ గురించి దర్శనం పొందిన ధ్యాన మండపంలో మోదీ ధ్యానం చేశారు. ప్రధాని మోదీ దృష్టిని దృష్టిలో ఉంచుకుని కన్యాకుమారి జిల్లా అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. సుమారు 2,000 మంది పోలీసులను మోహరించారు. ఇది కాకుండా, తమిళనాడు పోలీసులు, కోస్ట్ గార్డ్, నేవీకి చెందిన కోస్టల్ సెక్యూరిటీ గ్రూప్ గట్టి నిఘాను నిర్వహించింది.
అయితే, ప్రధాని మోదీ స్మారక స్థూపాన్ని సందర్శించడం పూర్తిగా వ్యక్తిగత పర్యటనగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై అభివర్ణించారు. ఇది ప్రధాని వ్యక్తిగత పర్యటన అని, అందుకే తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమానికి హాజరుకాలేదన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…