Viral Video: చెంగు చెంగున ఎగురుతున్న కృష్ణ జింకలు.. ఆ వీడియో ప్రధాని మోదీకి తెగ నచ్చేసింది.. మీరూ చూసేయండి..!

ప్రధాని నరేంద్ర మోదీ సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు హట్‌టాపిక్ మారింది. గుజరాత్‌ ఇన్‌ఫర్మేషన్‌ అనే ట్విటట్‌ ఖాతాలో షేర్‌ అయిన వీడియోపై ఆయన స్పందించారు.

Viral Video: చెంగు చెంగున ఎగురుతున్న కృష్ణ జింకలు.. ఆ వీడియో ప్రధాని మోదీకి తెగ నచ్చేసింది.. మీరూ చూసేయండి..!
Pm Modi On Deers

PM Narendra Modi on Herd of blackbucks: ప్రధాని నరేంద్ర మోదీ సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు హట్‌టాపిక్ మారింది. తరుచూ ఏదో ఒక విషయంపై ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూనే ఉంటారు. తాజాగా గుజరాత్‌ ఇన్‌ఫర్మేషన్‌ అనే ట్విటట్‌ ఖాతాలో షేర్‌ అయిన వీడియోపై ఆయన స్పందించారు. ఆ వీడియోపై ‘‘ అద్భుతం’’ అని కామెంట్‌ కూడా చేశారు. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.. గుజరాత్‌, భావ్‌నగర్‌ జిల్లాలోని కృష్ణజింకల నేషనల్‌ పార్కులో దాదాపు 3 వేలకు పైగా కృష్ణజింకలు ఒకేసారి రోడ్డు దాటుతూ కనివిందు చేశాయి. ప్రధాని మోదీ షేర్ చేసిన వీడియో.. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌గా మారింది.

గుంపులు, గుంపులుగా అంత పెద్ద సంఖ్యలో చెంగు చెంగున ఎగురుతూ అవి రోడ్డు దాటుతూ అబ్బురపరిచాయి. నిజంగానే చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది. ప్రధాని మోదీ ఈ వీడియోపై స్పందించటంతో అది​కాస్తా సోషల్‌మీడియాలో పాపులర్ అయిపోయింది. దీనిపై నెటిజన్లు.. ‘‘దీన్ని చూడగానే బాగా సంతోషించేది సల్మాన్‌ ఖాన్‌’’.. ‘‘నిజానికి అవి నల్లగా లేవు. కానీ, వాటిని ఎందుకు బ్లాక్‌ బక్స్‌ అని అంటారు’’.. ‘‘ఆ అడవిలో రిపబ్లిక్‌ డే పరేడ్‌ జరుగుతోంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Read Also..

NEET Exam Centre: రాజమండ్రిలో నీట్ పరీక్ష కేంద్రం ఏర్పాటుకు వైసీపీ ఎంపీల వినతి.. ఉభయగోదావరి జిల్లాల విద్యార్థులకు ఊరట దక్కేనా.?

Click on your DTH Provider to Add TV9 Telugu