Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియురాలి పెళ్లిని ఆపాలని ఏకంగా ముఖ్యమంత్రికే మెస్సేజ్ పెట్టాడు..! సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ట్వీట్

Man Asks Bihar CM : కరోనా వైరస్ సంక్షోభంలో రాష్ట్రంలో వివాహాలను నిషేధించాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ని ఓ

ప్రియురాలి పెళ్లిని ఆపాలని ఏకంగా ముఖ్యమంత్రికే మెస్సేజ్ పెట్టాడు..! సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ట్వీట్
Man Asks Bihar Cm
Follow us
uppula Raju

|

Updated on: May 21, 2021 | 3:40 PM

Man Asks Bihar CM : కరోనా వైరస్ సంక్షోభంలో రాష్ట్రంలో వివాహాలను నిషేధించాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ని ఓ యువకుడు ట్విట్టర్ వేదికగా వేడుకున్నాడు. అయితే తర్వాత తెలిసింది ఏంటంటే తన ప్రియురాలి పెళ్లిని ఆపడానికి ఈ ప్రయత్నం చేశాడని తెలుస్తుంది. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మే13 న ట్విట్టర్‌ వేదికగా సీఎం నితీశ్ కుమార్ ఇలా అన్నారు. “లాక్డౌన్ సానుకూల ఫలితం స్పష్టంగా ఉంది. అందువల్ల లాక్‌డౌన్‌ను మరో 10 రోజులు అంటే మే 16 నుంచి 25 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మే 16 న రాష్ట్రంలో 6,894 కొత్త కేసులు, 5.73 శాతం పాజిటివ్ రేటు నమోదవడంతో బీహార్ ఆరోగ్య పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని” అన్నారు.

ఈ ట్వీట్‌కు పంకజ్ కుమార్ గుప్తా సమాధానమిస్తూ “అయ్యా మీరు వివాహాలకు నిషేధం విధించగలిగితే మే 19 న జరగాల్సిన నా స్నేహితురాలు వివాహం కూడా నిలిచిపోతుంది. నేను మీకు ఎప్పటికీ కృతజ్ఞుడను ” అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూజర్లు నవ్వుతూ కామెంట్లు, షేర్స్ చేస్తున్నారు. దీంతో పంకజ్ కుమార్ గుప్తా, నితీష్ కుమార్ కు చేసిన ట్వీట్ వేలాది లైకులతో నిండిపోయింది.

కరోనా వైరస్ పరిస్థితి విషయానికొస్తే.. భారతదేశం గత 24 గంటల్లో 2.59 లక్షల తాజా కోవిడ్ -19 కేసులు, 4,200 మందికి పైగా మరణాలు సంభవించాయి. గరిష్టంగా కేసులు నమోదు చేసిన మొదటి ఐదు రాష్ట్రాలు ఇలా ఉన్నాయి. 35,579 కేసులతో తమిళనాడు, 30,491 కేసులతో కేరళ, 29,911 కేసులతో మహారాష్ట్ర, కర్ణాటక 28,869, ఆంధ్రప్రదేశ్ 22,610 ఉన్నాయి.

Car Offers: కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకో గుడ్‌న్యూస్‌.. ఆ మోడల్ పై రూ.75 వేల వరకు డిస్కౌంట్​

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 15 రోజుల అదనపు జీతం అందుకోబోతున్నారు.. లిస్టులో మీ పేరు ఉందా..?

Twitter Account: సోషల్ మీడియా ట్విట్టర్‌లో మీకు ఖాతా ఉందా.. అకౌంట్ తెరవాలంటే ఇలా చేయండి…