Twitter Account: సోషల్ మీడియా ట్విట్టర్‌లో మీకు ఖాతా ఉందా.. అకౌంట్ తెరవాలంటే ఇలా చేయండి…
ట్విట్టర్‌లో అధికారిక ఖాతా సామాన్యులకు అందని ద్రాక్షలా మిగిలిపోయింది. కాగా, మూడేళ్ల తర్వాత పబ్లిక్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ట్విట్టర్ ప్రారంభించింది.
Twitter Begins Accepting Public Account: సోషల్ మీడియా అంటే ముందుగా గుర్తు్కు వచ్చే పేరు ట్విట్టర్… సెలబ్రెటీలు గానీ, ప్రభుత్వపరంగా గానీ ఎక్కువగా ఉపయోగించే సామాజిక మాధ్యమం ట్విట్టర్. వ్యక్తులు గానీ ప్రభుత్వాలు గానీ సంస్థలుగా తమ సందేశాలను చేరవేసేందుకు దీనినే వేదికగా చేసుకుంటారు. తమ భావ స్వేచ్ఛను వ్యక్తం చేసేందుకు వినియోగిస్తుంటారు. ప్రపంచంలోని ప్రముఖులు అంతా ట్విట్టర్‌ను ప్రధానంగా వాడుతుంటారు. అధికారిక ప్రకటనలకు కూడా ట్విట్టర్ ప్రధాన వేదిక అవుతోంది. అందుకే సోషల్ మీడియా వేదికల్లో ట్విట్టర్‌కు ప్రత్యేక స్థానం ఉంది.
అయితే ట్విట్టర్‌లో అధికారిక ఖాతా సామాన్యులకు అందని ద్రాక్షలా మిగిలిపోయింది. కాగా, మూడేళ్ల తర్వాత పబ్లిక్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ట్విట్టర్ ప్రారంభించింది. వెరిఫికేషన్ ఖాతాల కోసం అప్లికేషన్లు తీసుకోబోతున్నట్లు ట్విట్టర్ గురువారం ప్రకటించింది. 2017 నవంబర్‌లో పబ్లిక్ వెరిఫికేషన్‌ను ట్విట్టర్ నిలిపివేసింది. అనంతరం తొందరలోనే ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తామని సంస్థ ట్వీట్ చేసినప్పటికీ వివిధ కారణాల వల్ల అది ప్రారంభం కాలేదు.
ఖాతా తెరవాలంటే ఎవరు అర్హులు.. ట్విట్టర్ ఖాతా వెరిఫికేషన్‌కు సంబంధించి అప్లికేషన్ కొరకు వివిధ కేటగిరీలను ప్రతిపాదించారు. అందులో 1. ప్రభుత్వ 2. కంపెనీలు, బ్రాండ్లు, ఆర్గనైజేషన్లు 3. న్యూస్ ఆర్గనైజేషన్లు, జర్నలిస్టులు 4. ఎంటర్‌టైన్‌మెంట్ 5. స్పోర్స్ అండ్ గేమింగ్ 6. యాక్టివిస్ట్‌లు, ఆర్గనైజర్లు, పబ్లిక్‌లో పేరున్న ఇతర వ్యక్తులు వెరిఫైడ్ ఖాతా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా ఖాతా ఎలా రిజిస్ట్రర్ చేసుకోవాలి….
✉ ట్విట్టర్ యాప్ ద్వారా కానీ, లేదంటే గూగుల్ బ్రౌజర్ నుంచి కానీ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వాలి.
✉ ట్విట్టర్ లాగిన్ కొరకు అవసరమైన ప్రశ్నలకు అడిగిన వివరాలు ఇవ్వాలి.
✉ ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్స్ ఇన్ఫర్మేషన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
✉ వెరిఫైడ్ అనే ఆప్షన్ కింద ‘రెక్వెస్ట్ వెరిఫికేషన్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
✉ట్విట్టర్ అడిగిన వివరాలు జతచేసి రెక్వెస్ట్ పంపితే, ట్విట్టర్ ఖాతాకు జత చేసిన ఈమెయిల్ ఖాతాకు ధ్రువీకరణ ఈమెయిల్ వస్తుంది. దీంతో మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.
✉ మీరు పంపిన వివరాల్ని తనిఖీ చేసి వెరిఫైడ్ ఖాతాను ట్విట్టర్ విడుదల చేస్తుంది.
దీంతో ట్విట్టర్ మీకంటూ ఓ అకౌంట్ తెరుచుకుంటుంది. ఇకపై మీరు సందేశాలను పంపించేందుకు వీలవుతుంది. నచ్చిన వీడియోలను పోస్టు చేసుకోవచ్చు.
Dear “can you verify me” ––
Save your Tweets and DMs, there’s a new official way to apply for a blue badge, rolling out over the next few weeks.
You can now submit an application to request verification in-app, right from your account settings!
-Your verified blue badge source pic.twitter.com/2d1alYZ02M
— Twitter Verified (@verified) May 20, 2021