RBI Alert About NEFT: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. రేపు రాత్రి నుంచి 14 గంటపాలు నెఫ్ట్ సేవల్లో అంతరాయం..
RBI Alert About NEFT: మీరు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారా? అయితే ఈ వార్త మీ కోసమే. శనివారం రాత్రి నుంచి సుమారు 14 గంటలపాటు ఈ సేవల్లో అంతరాయం ఏర్పడనుంది...
RBI Alert About NEFT: మీరు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారా? అయితే ఈ వార్త మీ కోసమే. శనివారం రాత్రి నుంచి సుమారు 14 గంటలపాటు ఈ సేవల్లో అంతరాయం ఏర్పడనుంది. ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్ కోసం ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) సేవల్లో అంతరాయం ఏర్పడనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. శనివారం అర్థరాత్రి 12.00 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటలకు ఈ సేవలు అందుబాటులో ఉండవు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించాలని ఆర్‌బీ ఓ ప్రకటనలో తెలిపింది. నెఫ్ట్ వ్యవస్థలో టెక్నికల్ కొత్త మార్పులు చేపడుతుండడమే ఈ అంతరాయానికి కారణమని తెలిపింది. ఇదిలా ఉంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్) సేవలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని ఆర్‌బీఐ పేర్కొంది. ఆర్‌టీజీఎస్ సేవల్లోనూ ఇలాంటి సాంకేతిక అప్‌గ్రేడ్‌ను ఏప్రిల 18న చేపట్టారు. నెఫ్ట్ సేఫల్లో అంతరాయం ఏర్పడనుండడంతో దీనికి అనుగుణంగా ఖాతాదారులు తమ లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలని ఆర్‌బీఐ తెలిపింది.
Also Read: Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవో తెలుసా..