Coronavirus: పెళ్లి తోర‌ణాలు క‌ట్టిన ఆ ఇళ్లు.. వ‌రుడు చావుతో విల‌విల్లాడింది.. ఎన్నాళ్లీ మ‌హ‌మ్మారి వ్య‌ధ‌లు..?

దేశవ్యాప్తంగా వేలాది కుటుంబాలను కరోనా చిన్నాభిన్నం చేస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా పసిబిడ్డలు మొదలు వృద్దుల వరకూ మహమ్మారి ఎంతోమందిని బలితీసుకుంటుంది.

Coronavirus: పెళ్లి తోర‌ణాలు క‌ట్టిన ఆ ఇళ్లు.. వ‌రుడు చావుతో విల‌విల్లాడింది.. ఎన్నాళ్లీ మ‌హ‌మ్మారి వ్య‌ధ‌లు..?
Corona Tragedy
Follow us
Ram Naramaneni

|

Updated on: May 21, 2021 | 2:29 PM

దేశవ్యాప్తంగా వేలాది కుటుంబాలను కరోనా చిన్నాభిన్నం చేస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా పసిబిడ్డలు మొదలు వృద్దుల వరకూ మహమ్మారి ఎంతోమందిని బలితీసుకుంటుంది. జీవితంలో మరెన్నో సాధించాలని కలలు కన్నవారు.. ఎంతో కష్టపడి ఇప్పడిప్పుడే తమ జీవితాన్ని చక్కగగా రూపుదిద్దుకుంటున్నవారు.. ఇలా ఎంతోమంది కరోనాతో అర్ధాంతరంగా బలైపోతున్నారు. తాజాగా విజయనగరం జిల్లా సాలూరు మండలంలో 22 ఏళ్ల ఓ యువకుడు కరోనాతో మృతి చెందాడు. మరో మూడు రోజుల్లో అతని పెళ్లి జరగాల్సి ఉండగా ఇంతలోనే ఆ యువకుడు మృతి చెందడం కుటుంబ సభ్యులకు తీరని విషాదం మిగిల్చింది. వివ‌రాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా కురుకుట్టి గ్రామానికి చెందిన ఓ యువకుడు బ్యాంకు పనిచేస్తున్నాడు. అయితే మే 23న అతని వివాహం జరగాల్సి ఉంది. కానీ మే 13న అతను కరోనా బారినపడటంతో మొత్తం రివర్స్‌ అయ్యింది. మొదట జ్వరం రావడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో హోం ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే అతని ఆక్సిజన్ లెవల్స్ తగ్గడంతో స్థానిక వైద్యురాలు అతన్ని ఆస్పత్రిలో చేరమని సూచించింది.

వైద్యురాలి సూచన మేరకు ఆ యువకుడు మొదట దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. ఆ తర్వాత అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం అతన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దాదాపు వారం రోజుల పాటు అతను అక్కడే చికిత్స పొందాడు. ఇక అతని ఆరోగ్యం బాగానే ఉందనుకుని.. తిరిగి ఇంటికి వస్తాడన్న నమ్మకంతో కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కానీ ఇంతలోనే పిడుగు లాంటి వార్త వారిని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి సమయంలో మృతి చెందాడని ఆస్పత్రి వర్గాలు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మరో మూడు రోజుల్లో పెళ్లి అనగా ఆ యువకుడు కరోనాతో మృతి చెందడం స్థానికంగా అందర్నీ కలిచివేసింది.

Also Read:  వరంగల్‌ ఎంజీఎంను సందర్శించిన సీఎం కేసీఆర్‌.. కరోనా వార్డులో రోగులకు ధైర్యం చెప్పిన సీఎం

ఈ రాశి వారు నూత‌న ప‌రిచ‌యాల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి.. నేడు మీ రాశిఫ‌లాల‌ను చెక్ చేసుకోండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!