Telangana CM KCR in Warangal: వరంగల్‌ ఎంజీఎంను సందర్శించిన సీఎం కేసీఆర్‌.. కరోనా వార్డులో రోగులకు ధైర్యం చెప్పిన సీఎం

రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వైద్య సేవలపై సీఎం కేసీఆర్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ఇటీవల సీకింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిని సందర్శించిన ఆయన..

Telangana CM KCR in Warangal: వరంగల్‌ ఎంజీఎంను సందర్శించిన సీఎం కేసీఆర్‌.. కరోనా వార్డులో రోగులకు ధైర్యం చెప్పిన సీఎం
Cm Kcr At Mgm
Follow us
Ram Naramaneni

|

Updated on: May 21, 2021 | 2:47 PM

రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వైద్య సేవలపై సీఎం కేసీఆర్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ఇటీవల సీకింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిని సందర్శించిన ఆయన తాజాగా వరంగల్‌ ఎంజీఎంలో తనిఖీలు నిర్వహించారు. హ‌న్మ‌కొండ‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో హెలికాప్టర్‌ నుంచి దిగిన కేసీఆర్‌.. అక్కడి నుంచి ప్ర‌త్యేక వాహ‌నంలో ఎంజీఎంకు చేరుకున్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో నేరుగా కరోనా వార్డుకు వెళ్లారు సీఎం కేసీఆర్‌. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ ఉన్నారు. పీపీఈ కిట్‌ లేకుండానే సీఎం కరోనా వార్డుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కరోనా బారినపడి చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు కేసీఆర్‌. తానున్నాన‌ని వారికి భరోసా కల్పించారు. ఎవరూ భయపడొద్దని ధైర్యం చెప్పారు. వైద్యులను అభినందించారు. కరోనా రోగులకు అందుతున్న సేవలు, సౌకర్యాల పరిశీలించారు.  పడకల వద్దకు వెళ్లి కరోనా రోగులతో మాట్లాడి.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్.

సంద‌ర్శ‌న అనంత‌రం ఎంజీఎం ఆస్పత్రి విస్తరణ, నూతన భవనంపై సీఎం సమీక్ష నిర్వ‌హించారు. ఎంజీఎంను సంద‌ర్శించిన త‌ర్వాత వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైలును ప‌రిశీలించారు సీఎం కేసీఆర్‌.. కాకతీయ మెడికల్‌ కాలేజీని ఆనుకొని ఉన్న జైలును ఆసుపత్రిగా మార్చాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జైలును సందర్శించి, అధికారులతో సమీక్షించారు. జైలును శివారుకు తరలించే ఏర్పాట్లలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.

Also Read:  వరంగల్‌ ఎంజీఎంను సందర్శించిన సీఎం కేసీఆర్‌.. కరోనా వార్డులో రోగులకు ధైర్యం చెప్పిన సీఎం

‘రెండు నిమిషాలాగితే చనిపోయే వాడినే.. ఈ లోగా మావాళ్లు కృష్ణపట్నం కరోనా మందు వేయడంతో బ్రతికున్నా’

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..