Horoscope Today: ఈ రాశి వారు నూత‌న ప‌రిచ‌యాల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి.. నేడు మీ రాశిఫ‌లాల‌ను చెక్ చేసుకోండి..

Horoscope Today: రాశి ఫ‌లాల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకునే వారు మ‌న‌లో చాలా మంది ఉంటారు. కొత్త ప‌నులు ప్రారంభించే ముందు రాశి ఫ‌లితం ఎలా ఉందో చూసుకొని...

Horoscope Today: ఈ రాశి వారు నూత‌న ప‌రిచ‌యాల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి.. నేడు మీ రాశిఫ‌లాల‌ను చెక్ చేసుకోండి..
Horoscope Today
Follow us
Narender Vaitla

|

Updated on: May 21, 2021 | 1:18 PM

Horoscope Today: రాశి ఫ‌లాల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకునే వారు మ‌న‌లో చాలా మంది ఉంటారు. కొత్త ప‌నులు ప్రారంభించే ముందు రాశి ఫ‌లితం ఎలా ఉందో చూసుకొని వాయిదా వేడ‌యం, లేదా.. ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీస‌కుంటారు. మ‌రి ఈరోజు మీ రాశి ఫ‌లితాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి…

మేషరాశి..

మేష రాశి ఈరోజు చేప‌ట్టిన ప‌నుల్లో జాగ్ర‌త్తలు తీసుకోవాలి. కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌ణాళిక బ‌ద్ధంగా చేప‌ట్టి పూర్తి చేసుకోవాలి. గ‌ణ‌ప‌తి ఆరాధ‌న‌, పేద‌వారికి దానం చేయ‌డం వీరికి సూచించ‌ద‌గ్గ అంశం.

వృషభ రాశి..

ఈ రాశివారు ఈరోజు వ్యాపార‌, వృత్తిప‌ర‌మైన విష‌యాల్లో కొంత‌మేర ఒత్తిడి ఎదుర్కొంటారు. కొన్ని చిన్న చిన్న ఆందోళ‌న‌లు చోటుచేసుకునే అవ‌కాశం ఉంది. జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఉండాలి. ఆంజ‌నేయ స్వామిని ఉపాస‌న చేసుకోవ‌డం వీరికి మేలు చేస్తుంది.

మిథున రాశి..

మిథున రాశి వారికి ఈరోజు కొన్నిఆర్థిక ఇబ్బందులు ఒత్తిడికి గురి చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఆకస్మికంగా ప్ర‌యాణాలు చేప‌డుతుంటారు.. శ్ర‌మ‌కు గుర‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ల‌లితా అమ్మ‌వారి ఉపాస‌న ఈ రాశివారికి మేలు చేస్తుంది.

కర్కాటక రాశి..

ఈ రాశి వారు ఈరోజు నూత‌న ప‌రిచ‌యాల విషయాల్లో జాగ్ర‌త్త‌లు వ‌హిస్తూ ఉండాలి. స‌మాజంలో మీకున్న గౌర‌వాన్ని కోల్పోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. శివారాధ‌ణ ఈ రాశి వారికి మేలు చేస్తుంది.

సింహరాశి..

సింహ రాశి వారు చేప‌ట్టిన ప‌నులు కొంత నెమ్మ‌దిగా పూర్త‌వుతాయి. అలాగే భూ సంబంధిత వ్య‌వ‌హారాల్లో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. సుబ్ర‌మ‌ణ్య స్వామి వారి ఆరాధాన ఈ రాశివారికి మేలు చేస్తుంది.

కన్యరాశి..

ఈ రాశి వారు ఈరోజు ప‌రిస్థితుల‌కు త‌గిన‌ట్లుగా ఏర్పాటు చేసుకోవాలి. ఆర్థిక విష‌యాల్లో లోటుపాట్లు క‌నిపిస్తున్నాయి. మ‌హా ల‌క్ష్మీ ఆరాధ‌న ఈ రాశి వారికి సూచించ‌ద‌గ్గ అంశం.

తులా రాశి..

తులా రాశి వారు ఈరోజు ప్ర‌ముఖుల నుంచి ఆహ్వానం అందుకుంటారు, శ్ర‌మ పెరుగుతుంది జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం అవ‌స‌రం. ల‌క్ష్మీ నార‌సింహ స్వామి ఉపాస‌న మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి..

ఈ రాశి వారు నిర్ణ‌యాలు తీసుకునే విష‌యంలో తొంద‌ర‌ప‌డ‌కూడ‌దు. ఆరోగ్య విష‌యాల్లో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఆదిత్య హృద‌య స్తోత్ర పారాయ‌ణం మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి..

ధ‌నుస్సు రాశి వారు చేప్ట‌టిన ప‌నుల్లో కొన్నిఅవంత‌రాలు ఎదుర‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. విష్ణు సంబంధ‌మైన ఆరాధ‌న మేలు చేస్తుంది.

మకర రాశి..

ఈ రాశి వారు ఈరోజు కొన్ని శుభ‌వార్త‌లు వింటారు.. అయితే ఆరోగ్య విష‌యాల్లో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. శివ‌పంచాక్ష‌రి జపం ఈ రాశివారికి సూచించ‌ద‌గ్గ అంశం.

కుంభరాశి..

కుంభ రాశి వారికి ఈరోజు ఉద్యోగ ప్ర‌య‌త్నాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. ఇదే క్ర‌మంలో ఆస్తి లాభాలు క‌నిపిస్తున్నాయి. మ‌హాల‌క్ష్మీ ఆరాధణ ఈ రాశి వారికి మేలు చేస్తుంది.

మీన రాశి..

ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన ప‌నుల్లోజాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. ప్ర‌యాణాలు వాయిదా ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. విష్ణు స‌హ‌స్త్ర నామ స్తోత్ర పారాయ‌ణం ఈ రాశి వారికి సూచించ‌ద‌గ్గ అంశం.

Also Read: Telangana CM KCR in Warangal: వరంగల్ ఎంజీఎంను సందర్శిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. కరోనా రోగులతో మాట్లాడుతున్న సీఎం

Ponnambalam: ‘చిరంజీవి అన్నయ్యా మీ సాయం మరువలేనిది’.. ఎమోషనల్ అయిన నటుడు..

JIO Telugu States: తెలుగు రాష్ట్రాల జియో యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌… రెట్టింపు కానున్న డేటా వేగం..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే