PM Modi emotional: ప్రియమైనవారిని కోల్పోయాం.. భావోద్వేగానికి లోనైన ప్రధాని నరేంద్రమోదీ
తన నియోజకవర్గం వారణాసికి చెందిన వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ప్రధాని.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
PM Narendra Modi Emotional: కరోనా కట్టడిలో ఫ్రంట్‌లైన్ వర్కర్లు చేస్తున్న కృషిని మరోసారి ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోదీ. తన నియోజకవర్గం వారణాసికి చెందిన వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ప్రధాని.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కరోనాపై పోరులో ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని కన్నీరు పెట్టుకున్నారు. ఎక్కడ మహమ్మారి ప్రబలిందో.. అక్కడ చికిత్స అందాల్సిందే అన్నది మన కొత్త నినాదమని ప్రధాని మోదీ అన్నారు. దేశ ప్రజలందరికి వ్యాక్సిన్ ఇవ్వాల్సిందేనని స్పష్టంచేశారు. బ్లాక్ ఫంగస్ నియంత్రణ ఇప్పుడు మరో పెద్ద సవాల్ అన్నారు మోదీ.
దేశంలో కరోనా పరిస్థితిపై ఎప్పటిప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ.. తన సొంత నియోజకవర్గమైన వారణాసికి చెందిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఉన్నట్టుండి భావోద్వేగానికి లోనయ్యారు. కోవిడ్ మహమ్మారికి మనవాళ్లు ఎంతో మంది బలయ్యారని ఒకింద ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. నిన్నమొన్నటి వరకు మన చుట్టు పక్కనే ఉన్న చాలా మందిని కోవిడ్ బలి తీసుకుంటుదని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. డాక్టర్లు, ఇతర ఫ్రంట్ లైన్ కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్‌పై పోరాటం చేస్తున్నారని కొనియాడారు.
वैक्सीन की सुरक्षा से काफी हद तक हमारे फ्रंटलाइन वर्कर्स सुरक्षित रहकर लोगों की सेवा कर पाए हैं।
हमें अपनी बारी आने पर वैक्सीन जरूर लगवानी है। कोरोना के खिलाफ हमारी लड़ाई एक सामूहिक अभियान बन गई है।
वैसे ही टीकाकरण को भी हमें सामूहिक जिम्मेदारी बनाना है।
– पीएम @narendramodi pic.twitter.com/hIgOSSAGQI
— BJP (@BJP4India) May 21, 2021
కోవిడ్ మహమ్మారి సమయంలో వారు చేస్తున్న ధైర్యసాహసాలను అభినందించారు. కరోనా సెకండ్ వేవ్‌ను కట్టడి చేయడంలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,59,591 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 4,209 మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 30,27,925 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 14,82,754 మందికి వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.