AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Offers: కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకో గుడ్‌న్యూస్‌.. ఆ మోడల్ పై రూ.75 వేల వరకు డిస్కౌంట్​

Car Offers: ప్రస్తుతం ఆటో మొబైల్‌ కంపెనీలన్నీ సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించుకునేందుకు మరిన్ని ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి...

Car Offers: కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకో గుడ్‌న్యూస్‌.. ఆ మోడల్ పై రూ.75 వేల వరకు డిస్కౌంట్​
Subhash Goud
|

Updated on: May 21, 2021 | 2:57 PM

Share

Car Offers: ప్రస్తుతం ఆటో మొబైల్‌ కంపెనీలన్నీ సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించుకునేందుకు మరిన్ని ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి జపనీస్‌ వాహన తయారీ సంస్థ నిస్సాన్‌ కూడా చేరింది. నిస్సాన్‌ తన కిక్స్‌ యూవీపై బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ ఆఫర్​ కింద మొత్తం 75 వేల రూపాయల వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. నిస్సాన్ ఇండియా డీలర్‌షిప్‌ సెంటర్లలో కిక్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కొనుగోలు చేయడం ద్వారా రూ.20 వేల వరకు క్యాష్​ బ్యాక్​, రూ.50 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.5 వేల లాయల్టీ బెనిఫిట్స్​పొందే అవకాశం ఉంది. వీటికి తోడు ప్రభుత్వ ఉద్యోగులు, అధిక సిబిల్ స్కోరు ఉన్న కస్టమర్లకు అదనపు ప్రయోజనాలను కూడా లభిస్తాయి. నిస్సాన్ కిక్స్ XL, XV, XV ప్రీమియం, XV ప్రీమియం (O) అనే మొత్తం నాలుగు ట్రిమ్ లెవల్స్​లో అందుబాటులో ఉంటుంది. వీటిలో 1.3 -లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్, 1.5 -లీటర్ పెట్రోల్ ఇంజన్లను చేర్చింది. ఈ టర్బో మోటారు ఇంజిన్​ గరిష్టంగా 154 బిహెచ్‌పి, 254 ఎన్ఎమ్ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. మరో ఇంజిన్​ 105 బిహెచ్‌పి, 142 ఎన్‌ఎమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. కొనుగోలుదారులు మొత్తం ఐదు- స్పీడ్ మాన్యువల్, సిక్స్- స్పీడ్ మాన్యువల్, సివిటి ఆటోమేటిక్ ఇంజిన్లను ఎంపిక చేసుకోవచ్చు.

నిస్సాన్ కిక్స్

ఇక ఈ వేరియంట్లు ప్రస్తుతం రూ. 9.5 లక్షల నుంచి రూ. 14.65 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్య లభ్యమవుతున్నాయి. దీంతో పాటు నిస్సాన్ ఇటీవల తన డాట్సన్​, డాట్సన్​ గో వేరియంట్లపై ఆఫర్లను సైతం ప్రకటించింది. క్యాష్​బ్యాక్​, ఎక్స్​చేంజ్ బెనిఫిట్స్​వంటి వాటితో పాటు మెరుగైన సిబిల్ స్కోర్​ఉన్న కస్టమర్లకు అదనంగా రూ.7 వేల తగ్గింపు అందించింది.

అలాగే అదనపు ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంది. ఎలాగంటే.. కొనుగోలుదారుడు ప్రభుత్వ ఉద్యోగి లేదా 700 కంటే ఎక్కువ సిబిల్ రేటింగ్ కలిగి ఉండాలి. ఈ ఆఫర్లు ఎన్‌ఐసి ప్రారంభించిన డీలర్‌షిప్‌లో మాత్రమే లభిస్తాయని తెలిపింది. ధరలు వేరియంట్, కొనుగోలు చేసే ప్రదేశాన్ని బట్టి మారుతుంటాయి. ఈ ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు సమీపంలోని తమ​డీలర్​షిప్​ సెంటర్‌ను సందర్శించాలని నిస్సాన్​తెలిపింది.

ఇవీ చదవండి:

Bajaj Pulsar: బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూ.40 వేలకే బజాజ్‌ పల్సర్‌ బైక్‌.. ఎక్కడో తెలుసా..?

SBI Customer Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌.. 3 రోజులు ఆ సర్వీసులన్నీ బంద్.. ఎందుకో తెలుసా..?

Follow Us
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
కలలో పాము కరిచినట్లు వస్తోందా? అయితే లైట్ తీసుకోవద్దు..
కలలో పాము కరిచినట్లు వస్తోందా? అయితే లైట్ తీసుకోవద్దు..
సీలింగ్ ఫ్యాన్ గాలి రావడం లేదా?ఇలా చేశారంటే, ఖర్చు లేని స్పీడ్
సీలింగ్ ఫ్యాన్ గాలి రావడం లేదా?ఇలా చేశారంటే, ఖర్చు లేని స్పీడ్
బేకరీ స్టైల్ పిజ్జా టోస్ట్.. ఓవెన్ లేకుండా పెనంపైనే ఇలా చేసేయండి
బేకరీ స్టైల్ పిజ్జా టోస్ట్.. ఓవెన్ లేకుండా పెనంపైనే ఇలా చేసేయండి
ప్రతి కుర్రాడిని ఏడిపించేసింది. చంచల పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..
ప్రతి కుర్రాడిని ఏడిపించేసింది. చంచల పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..
ఓటీటీలో ధురంధర్.. అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్
ఓటీటీలో ధురంధర్.. అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్
పెద్ది‌తో పాన్ ఇండియా రికార్డుల వేటలో రామ్ చరణ్
పెద్ది‌తో పాన్ ఇండియా రికార్డుల వేటలో రామ్ చరణ్